Patiala Medical Collegeలో 100 మంది వైద్యవిద్యార్థులకు కరోనా

ABN , First Publish Date - 2022-01-04T14:58:52+05:30 IST

పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలా మెడికల్ కళాశాలలో 100 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది....

Patiala Medical Collegeలో 100 మంది వైద్యవిద్యార్థులకు కరోనా

పాటియాలా(పంజాబ్) : పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలా మెడికల్ కళాశాలలో 100 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. పాటియాలా,పఠాన్ కోట్ నగరాల్లో కరోనా పాజిటివిటీ రేటు 4.47 శాతానికి చేరింది. వైద్యకళాశాలలో కొవిడ్ వ్యాప్తితో హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు తక్షణం గదులు ఖాళీ చేయాలని కళాశాల యాజమాన్యం ఆదేశించింది.కరోనా కేసులు వెలుగుచూడటంతో పఠాన్ కోట్ నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేశారు. గత 6 రోజులుగా పంజాబ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.



 థాపర్ యూనివర్శిటీని ముందుజాగ్రత్తగా మూసివేశారు. పాటియాలాలో 502 కేసులు పఠాన్ కోట్ లో 298 కరోనా కేసులు వెలుగుచూశాయి.కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మంగళవారం సీఎం సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భటిండాలోని ఆదేశ్ యూనివర్శిటీలో విద్యార్థులకు కూడా కరోనా సోకింది. 

Updated Date - 2022-01-04T14:58:52+05:30 IST