Advertisement
Advertisement
Abn logo
Advertisement

వంద శాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యం

తంబళ్లపల్లె, డిసెంబరు 5: మండలంలో వంద శాతం వ్యాక్సినేషన్‌  లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎంపీహెచ్‌ఈవో వెంకట్రమణ తెలిపారు. ఆదివారం కన్నెమడుగు, ఎద్దులవారిపల్లె సచివాలయాల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆదివారం మండలంలోని 12 సచివాలయాల్లో ప్రత్యేక వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా 18 సంవత్సరాలు నిండిన 78 మందికి కొవిషీల్డ్‌ మొదటి డోసు వేశామన్నారు.  మండలవ్యాప్తంగా 18 సంవత్సరాలు పైబడిన 31,632 మంది ఉండగా, ఇప్పటివరకూ 28,363 మంది మొదటి డోసు, 19,762 మంది రెండు డోసులు వేసినట్లు తెలిపారు. కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ ప్రమాదం పొంచి ఉన్నందున ప్రతి ఒక్కరూ  రెండు డోసులు వేసుకుని, కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు కవిత, రెడ్డెమ్మ, ఆశ కార్యకర్తలు సిద్దమ్మ, విజయకుమారి, రోజా తదితరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement