Advertisement
Advertisement
Abn logo
Advertisement

మానవతావాది అంబేడ్కర్‌

దివాన్‌చెరువు, డిసెంబరు 6: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ గొప్ప మానవతావాది అని, మానవత్వమే అంబేడ్కర్‌ సిద్ధాంతమని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి మొక్కా జగన్నాథరావు అన్నారు. అంబే డ్కర్‌ వర్ధంతిని జిల్లాలో పలుచోట్ల సోమవారం ఘనంగా నిర్వహించారు. పలు వురు అధికారులు, నాయకులు ఆయనకు నివాళులర్పించారు. నన్నయ విశ్వవి ద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వీసీతోపాటు వర్శిటీ అధికారులు అంబే డ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్‌కు ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాను నమ్మిన సిద్ధాంతాన్ని విడిచిపెట్టలేదని చెప్పారు. ఆయనను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ప్రిన్సిపాల్‌ కూర్మయ్య, రిజిస్ట్రార్‌ ఆచార్య టి.అశోక్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement