‘మానవత’ సేవలు మరింత మందికి చేరాలి

ABN , First Publish Date - 2022-07-04T05:09:13+05:30 IST

భవిష్యత్తులో ‘మానవ త’ సేవలు మరింత మందికి చేరువకావాలని అన్న మయ్య జిల్లా విద్యాశాఖ అధికారి రాఘవరెడ్డి అన్నా రు.

‘మానవత’ సేవలు మరింత మందికి చేరాలి
ప్రమాణస్వీకారం చేయిస్తున్న డీఈవో రాఘవరెడ్డి, తదితరులు

రాయచోటిటౌన్‌, జూలై 3: భవిష్యత్తులో ‘మానవ త’ సేవలు మరింత మందికి చేరువకావాలని అన్న మయ్య జిల్లా విద్యాశాఖ అధికారి రాఘవరెడ్డి అన్నా రు. ఆదివారం పట్టణంలోని డైట్‌ కళాశాల ప్రాంగ ణంలో మానవత స్వచ్ఛంద సంస్థ రాయచోటి మం డల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా మానవత వ్యవస్థాపకుడు రామచంద్రారెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి రాఘవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మానవతా రాయచోటి మండలశాఖ అధ్యక్షుడుగా శివశంకర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడుగా ఖాదర్‌ బాషా, కార్యదర్శిగా అశోక్‌ కుమార్‌ రెడ్డి, కోశాధి కారిగా ద్వారపాలకరెడ్డితో పాటు ఇతర కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంత రం నూతన అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ ప్రజా సేవకు శక్తి వంచనలేకుండా కృషి చేస్తామ న్నారు. అనంతరం జిల్లా విద్యాశాఖాధికారిని సన్మానించి జ్ఞాపిక అందజేశారు. మానవత గౌరవ సలహాదారు బెల్లం లోకనాథరెడ్డి, చైర్మన్‌ అరమాటి శివగంగిరెడ్డి, కన్వీనర్‌ వెంకట్రామిరెడ్డి, మాజీ అధ్య క్షుడు గుండ్లపల్లె వెంకటేష్‌, కోచైర్మన్‌ ఎన్‌ఎండీ షకీల్‌, జిల్లా కమిటీ సభ్యులు బ్రహ్మానందరెడ్డి, సహదేవరెడ్డి, సభ్యులు రెడ్డెప్పరెడ్డి, రవిశంకర్‌రెడ్డి, రెడ్డి శేఖర్‌రెడ్డి, వెంకట్రాజు, సురేందర్‌, వైసీపీ టీఎఫ్‌ కో ప్రెసిడెంట్‌ నరసింహారెడ్డి పాల్గొన్నారు. 

గాలివీడు: ఆపన్నులకు సేవ చేయడమే మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ధ్యేయమని సంస్థ వ్యవస్థాప కుడు రామచంద్రారెడ్డి అన్నారు. గాలివీడులోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం ఆ సంస్థ మండల కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు.  అనంతరం జిల్లా స్థాయి నుంచి వచ్చిన సంస్థ ప్రముఖులు ప్రమాణ పత్రాన్ని చదివి కొత్త కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు. వెలిగింటి చంద్రారెడ్డి  అధ్యక్షుడుగా, కార్యదర్శిగా ప్రభాకర్‌, కోశాధికారిగా చెంగల్‌రాజు, ఉపాద్యక్షుడు గా పెద్దిరెడ్డి బయ్యారెడ్డి, సంయుక్త కార్యదర్శిగా దా మోదరయ్య, కార్యవర్గ సభ్యులుగా హరి, విశ్వనాథ రెడ్డి, డాక్టర్‌ శంకర్‌రెడ్డి, దామోదరయ్య, హీరా, అల్లా బక్ష్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో గాలివీడుశాఖ చైర్మన్‌ మలసాని సుబ్బారెడ్డి, సంస్థ కన్వీనర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-04T05:09:13+05:30 IST