20 ఏళ్లలో మానవ సమాజ అంతం.. నిజమేనంటునన్న అధ్యయం

ABN , First Publish Date - 2021-07-27T13:53:40+05:30 IST

మానవుడు సమాజ జీవి. సమాజంలో మిగతావారితో కలిసి జీవిస్తుంటాడు. అయితే త్వరలో మానవ సమాజం అంతం కాబోతోందని తాజాగా ఓ అధ్యయనం షాకింగ్ విషయాలు ..

20 ఏళ్లలో మానవ సమాజ అంతం.. నిజమేనంటునన్న అధ్యయం

మానవుడు సమాజ జీవి. సమాజంలో మిగతావారితో కలిసి జీవిస్తుంటాడు. అయితే త్వరలో మానవ సమాజం అంతం కాబోతోందని తాజాగా ఓ అధ్యయనం షాకింగ్ విషయాలు వెల్లడించింది. మానవ సమాజం మరో రెండేళ్లలో అంతం అయిపోతుందని, ప్రస్తుతం అంతానికి అతి చేరువలో ఉందని పేర్కొంది. ప్రస్తుతం జరుగుతున్న నాగరిక విధానాలు, వ్యాపార- వాణిజ్యాలు ఇలాగే కొనసాగితే 2040లోగా ఆర్ధిక వృద్ధి పూర్తిగా నిలిచిపోతుంది, దానివల్ల మానవ సమాజం అంతమైపోయే ప్రమాదం కూడా ఉందని పేర్కొంది. ఇక ఇదే విషయాన్ని 1972లో కూడా మాసాచూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థ చేసిన పరిశోధన ప్రకారం.. మానవ సమాజం చారమాంకంలో ఉంది. కేవలం 2 దశాబ్దాల్లో అది అంతం అయిపోవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా చేరిన అధ్యయనం కూడా రెండు దశాబ్దాలే సమయం ఇవ్వడం గమనార్హం.

Updated Date - 2021-07-27T13:53:40+05:30 IST