హుజూరాబాద్‌లో భారీ జాతీయ జెండా ప్రదర్శన

ABN , First Publish Date - 2022-08-11T05:42:21+05:30 IST

ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా హుజూరాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో భారీ జాతీయ జెండా ప్రదర్శన బుధవారం నిర్వహించారు.

హుజూరాబాద్‌లో భారీ జాతీయ జెండా ప్రదర్శన
హుజూరాబాద్‌లో జాతీయ జెండాను ప్రదర్శిస్తున్న బీజేపీ నాయకులు

హుజూరాబాద్‌, ఆగస్టు 10: ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా  హుజూరాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో భారీ జాతీయ జెండా ప్రదర్శన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో క్రాస్‌ నుంచి 300 మీటర్ల జాతీయ జెండాతో పట్టణంలోని పలు వీధుల్లో ర్యాలీ తీశారు. ఈ మేరకు అంబేద్కర్‌ చౌరస్తా జాతీయ జెండాను ప్రదర్శించారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ దేశ సమైక్యతను చాటే విధంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ స్ఫూర్తిని చాటి చెప్పాలన్నారు. కార్యక్రమంలో రాజు, వెంకట్‌రెడ్డి, ప్రవీణ్‌, ముత్యంరావు, సుధాకర్‌, ఆదిరెడ్డి, సంపత్‌రావు, తిరుపతిరెడ్డి, సుమన్‌, ప్రభాకర్‌, సంజీవరెడ్డి, రమేష్‌, బాలాజీ, విజయేందర్‌రెడ్డి, కొండాల్‌రెడ్డి, రేణుక, స్వాతిరెడ్డి, చంద్రిక, దేవేందర్‌రావు, అనురాగ్‌, చైతన్యరెడ్డి, వాసు, రాజు, సారయ్య, మనోజ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-11T05:42:21+05:30 IST