వందేళ్లలో తొలిసారి 450 రైల్వే కోచ్ లు ఒకే చోట పార్కింగ్

ABN , First Publish Date - 2020-04-09T11:15:31+05:30 IST

గత వంద సంవత్సరాలలో భారత రైల్వే తన కార్యకలాపాలను నిలిపివేయడం ఇదే మొదటిసారి. తూర్పు రైల్వేలోని హౌరా రైల్వే డివిజన్‌కు చెందిన టికియపారా కోచింగ్ యార్డ్‌లోని 40 ట్రాక్‌లపై...

వందేళ్లలో తొలిసారి 450  రైల్వే కోచ్ లు ఒకే చోట పార్కింగ్

న్యూఢిల్లీ: గత వంద సంవత్సరాలలో భారత రైల్వే తన కార్యకలాపాలను నిలిపివేయడం ఇదే మొదటిసారి. తూర్పు రైల్వేలోని హౌరా రైల్వే డివిజన్‌కు చెందిన టికియపారా కోచింగ్ యార్డ్‌లోని 40 ట్రాక్‌లపై 600 కి పైగా బోగీలు నిలిచివున్నాయి. ఈ యార్డ్‌లో ఇప్పుడు 50 మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు. ఐసోలేషన్ కోచ్‌లు రూపొందించే పనిని వారికి అప్పగించారు. నిజానికి భారతీయ రైల్వే 24 గంటలు... 365 రోజులు పనిచేస్తుంటుంది. కానీ ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా  రైల్వే వ్యవస్థ నిలిచిపోయింది. రైల్వే చరిత్రలో ఎప్పుడూ 450 కోచ్‌లు ఒకే సమయంలో హౌరా కోచింగ్ యార్డ్‌లో ఒకే చోట పార్క్ చేసిందే లేదు. ఇక్కడ 100కి పైగా ట్రాక్‌లు ఉన్నాయి, ఇక్కడ పార్కింగ్ స్థలంలో రాజధాని, శతాబ్ది, దురోంతో, పూర్వా, యువ ఎక్స్‌ప్రెస్ అనేక ఇతర ముఖ్యమైన రైళ్లను నిలిపి ఉంచారు. టికియపారా కోచింగ్ యార్డ్  అధికారి (ఎస్ఎస్ఇ) ఎకె రాయ్ మాట్లాడుతూ తన  33 సంవత్సరాల ఉద్యోగ సేవలో, ఇక్కడ కేవలం 1200 మంది ఉద్యోగులు ఉన్న పరిస్థితిని ఎప్పుడూ చూడలేదన్నారు. వారిలో 55 మంది ఐసోలేషన్ కోచ్ లను  తయారు చేయడానికి మాత్రమే ఉన్నారని తెలిపారు.

Updated Date - 2020-04-09T11:15:31+05:30 IST