బిల్లులు ఇవ్వకుండా పనులు చేయమంటే ఎలా?

ABN , First Publish Date - 2022-06-30T06:44:03+05:30 IST

చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయకుండా నిర్మాణాలు త్వరగా పూర్తి చేయమని చెబితే ఎలా అని కాంట్రాక్టర్లు పంచాయతీరాజ్‌ డీఈ దయాకర్‌రెడ్డిని నిలదీశారు.

బిల్లులు ఇవ్వకుండా పనులు చేయమంటే ఎలా?
సమావేశంలో మాట్లాడుతున్న డీఈ దయాకర్‌ రెడ్డి

- పీఆర్‌ డీఈని నిలదీసిన కాంట్రాక్టర్లు

పాలసముద్రం, జూన్‌ 29: చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయకుండా నిర్మాణాలు త్వరగా పూర్తి చేయమని చెబితే ఎలా అని కాంట్రాక్టర్లు పంచాయతీరాజ్‌ డీఈ దయాకర్‌రెడ్డిని నిలదీశారు. తమకు మాత్రం డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. కొన్ని పనులు చేసి సంవత్సరం గడుస్తున్నా బిల్లులు మంజూరు చేయలేదని, అప్పుల పాలయ్యామని గోడును వెల్లబోసుకున్నారు. మండలంలో అసంపూర్తిగా ఉన్న సచివాలయ, రైతు భరోసా, వెల్‌నెస్‌ సెంటర్‌ భవనాల నిర్మాణంపై పీఆర్‌ డీఈ ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం కాంట్రాక్టర్లతో సమావేశమయ్యారు. భవన నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కోరగా కాంట్రాక్టర్లు పైవిధంగా స్పందించారు. ఈ విషయాలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి త్వరగా బిల్లులు మంజూరు చేయిస్తామని ఆయన కాంట్రాక్టర్లకు భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీపీ శ్యామల, జడ్పీటీసీ అన్బు, ఎంపీడీవో ఉమావాణి, ఏఈ మునిరాజ్‌, వైసీపీ సంయుక్త కార్యదర్శి శివప్రకాష్‌ రాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-30T06:44:03+05:30 IST