గూగుల్‌ క్రోమ్‌ పాస్‌వర్డ్స్‌ డిలీట్‌

ABN , First Publish Date - 2022-06-11T05:55:35+05:30 IST

గూగుల్‌ క్రోమ్‌లో సేవ్‌ అయిన పాస్‌వర్డ్స్‌, చిరునామాలు యూజర్లను ఇబ్బందులు పెడుతుంటాయి. అవి తప్పుడు వ్యక్తుల చేతిలో పడితే అంతే.

గూగుల్‌ క్రోమ్‌ పాస్‌వర్డ్స్‌ డిలీట్‌

గూగుల్‌ క్రోమ్‌లో సేవ్‌ అయిన పాస్‌వర్డ్స్‌, చిరునామాలు యూజర్లను  ఇబ్బందులు పెడుతుంటాయి. అవి తప్పుడు వ్యక్తుల చేతిలో పడితే అంతే.  అయితే డిలీట్‌ చేసుకునేందుకు గూగుల్‌ క్రోమ్‌లో చాన్స్‌ ఉంది. నిజానికి 2011లో ‘ఆటోఫిల్‌’ పేరిట పాస్‌వర్డ్‌ ఫీచర్‌ను గూగుల్‌ క్రోమ్‌ పరిచయం చేసింది. ఒకటే విషయాన్ని పదేపదే టైప్‌ చేయాల్సిన అవసరం రాకుండా చూసేందుకు ఆటోఫిల్‌ ఎంతగానో ఉపయోగపడింది. పర్సనల్‌ సిస్టమ్‌ల విషయంలో ఇది యూజ్‌ఫుల్‌గా ఉన్నా, రాన్రాను అదే వినియోగదారులను ఇబ్బంది పెడుతోంది. పాస్‌వర్డ్‌, చిరునామాలు, కార్డ్‌ వివరాల విషయంలో  సమస్యగా మారింది. అయితే ఆ ఇబ్బందిని అధిగమించవచ్చు. ఎలాగంటే..


క్రోమ్‌ బ్రౌజర్‌ను ఓపెన్‌ చేయాలి.


స్ర్కీన్‌ రైట్‌ కార్నర్‌లో వెర్టికల్‌గా ఉండే మూడు చుక్కలను క్లిక్‌ చేయాలి. 


డ్రాప్‌ డౌన్‌ మెనూలో సెట్టింగ్స్‌ ఆప్షన్స్‌ని క్లిక్‌ చేయాలి. 


లెఫ్ట్‌సైడ్‌ బార్‌లో ఉన్న ఆటోఫిల్‌ టాబ్‌పై క్లిక్‌ చేయాలి. 


పాస్‌వర్డ్స్‌, పేమెంట్స్‌, చిరునామాలకు సంబంధించి స్టోర్‌ అయి ఉన్న డేటాని ఒకేసారి మాన్యువల్‌గా డిలీట్‌ చేయవచ్చు. 


ఆటోఫిల్‌ డేటా యావత్తూ డిలీట్‌ చేయాలని అనుకుంటే, లెఫ్ట్‌ పానెల్‌లో ఉన్న ప్రైవసీ అండ్‌ సెక్యూరిటీపై క్లిక్‌ చేయాలి. 


క్లియర్‌ బ్రౌజింగ్‌ డేటాపై క్లిక్‌ చేయాలి. 


డేటా అండ్‌ పాస్‌వర్డ్స్‌ నుంచి ఆటోఫిల్‌ను ఎంపిక చేసుకోవాలి. ఇక ఇతర సైన్‌ ఇన్‌ డేటాను అడ్వాన్స్‌డ్‌ టాబ్‌ నుంచి తీసుకోవాలి. 

క్లియర్‌ డేటా బటన్‌పై క్లిక్‌ చేయాలి. 


డేటా డిలీట్‌తో బ్రౌజింగ్‌ డేటా రిమూవ్‌ కాదు. బ్రౌజర్‌ హిస్టరీ, డౌన్‌లోడ్‌ హిస్టరీ, కుకీస్‌ వంటివి డిలీట్‌ కావు. 

Updated Date - 2022-06-11T05:55:35+05:30 IST