వసూలు చేసేదెలా

ABN , First Publish Date - 2021-11-27T04:22:42+05:30 IST

విద్యుత్‌ శాఖలో బిల్లులు వసూలు చేయడం ఇబ్బందిగా మారింది. వసూళ్లు చేసేది గోరంత అయితే బకాయిలేమో కొండంత పేరుకుపోయాయి.

వసూలు చేసేదెలా
వనపర్తిలోని 220 కేవీ సబ్‌స్టేషన్‌

- విద్యుత్‌శాఖలో పేరుకు పోయిన బిల్లులు

- జిల్లా వ్యాప్తంగా రూ. 29.38 కోట్లకు పైగా బకాయిలు

- రూ. 15.62 కోట్లు గ్రామ పంచాయతీలవే

- మునిసిపాలిటీల బిల్లులు రూ. 7.89 కోట్లు 

- వసూళ్ల కోసం తంటాలు పడుతున్న అధికారులు

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, నవంబరు 26 :  విద్యుత్‌ శాఖలో బిల్లులు వసూలు చేయడం ఇబ్బందిగా మారింది. వసూళ్లు చేసేది గోరంత అయితే బకాయిలేమో కొండంత పేరుకుపోయాయి. వనపర్తి జిల్లా లో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల నుంచి రావా ల్సిన బకాయి బిల్లులు దాదాపు రూ. 29.38 కోట్ల  ఉంది. దీన్ని బట్టి చూస్తేనే బకాయిలు ఏ విధంగా పేరుకుపోయాయో  అర్థం చేసుకోవచ్చు. విద్యుత్‌ సంస్థలు నష్టాల్లో కొనసాగుతున్నాయని ఆందోళనలు చెందుతుండగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ స్థాయి లో బిల్లులు పేరుకుపోతే సంస్థలు నష్టాల్లో కాకపోతే లాభాల్లో ఎలా నడుస్తాయి. ఒక వనపర్తి జిల్లాలోనే ఇంత భారీ మొత్తంలో బిల్లులు పెండింగులో పడ్డాయంటే రాష్ట్రం మొత్తంలో ఎంత వసూలు కావలసి ఉందో అంచనాలు కూడా వేయలేం.  

పేరుకుపోయిన బకాయిలు..

జిల్లావ్యాప్తంగా విద్యుత్‌ బకాయిలు పేరుకు పో యాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలకు సంబంధించి మొత్తం రూ.29 కోట్లకు పైగా కరెంటు బిల్లులు వ సూలు కావాల్పి ఉంది. వనపర్తి జిల్లాలో మొత్తం 2 లక్షల 14 వేల 729 విద్యుత్‌ సర్వీస్‌ కనెక్షన్లు ఉన్నా యి. వీటిలో జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ సర్వీస్‌లు 51 వేల 745, నివాసాలకు సంబంధించి లక్షా 41 వేల 37 సర్వీసులు, కమర్షియల్‌ 17 వేల 129 సర్వీసులు ఉండగా మిగిలినవి వాటర్‌వర్క్స్‌, వీధిలైట్లు, పరిశ్రమలు, ఇతర స్కూలు భవనాలవి ఉన్నాయి.  వీటిలో 15,305 డిస్‌కనెక్టు కాగా 25,425 కనెక్షన్లు బిల్‌స్టాప్‌ పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం సరఫరా కొనసాగుతున్న కనెక్షన్లు లక్షా 73 వేల 999 మాత్ర మే. వీటన్నింటిని పరిశీలిస్తే ప్రభుత్వ రంగాలకు చెం దిన వాటివే అత్యధికంగా బిల్లులు పెండింగులో ఉ న్నాయి.  జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో వాటర్‌వర్క్స్‌, వీధి లైట్లకు సంబంధించి రూ.15 కోట్ల 62 లక్షలు పెండింగులో ఉండగా, జిల్లాలోని ఐదు మునిసిపాలిటీలలో నీటి సరఫరా, స్ట్రీట్‌ లైట్లకు సంబంధించి రూ. 7 కోట్ల 89 లక్షల బకాయిలు విద్యుత్‌ శాఖకు రావాల్సి ఉన్నాయి. 

 ప్రత్యేక కార్యాచరణ 

విద్యుత్‌ బకాయిలు వసూళ్లు చేయడానికి ఆ శాఖ అధికారులు ప్రత్యేక కార్యచరణ అమలు చేస్తున్నారు. నివాసాలు, కమర్షియల్‌, ప్రైవేటు రంగాలకు చెందిన బిల్లులు ప్రతీ నెలా రాబట్టడానికి లైన్‌మెన్లకు బాధ్య తలు అప్పగిస్తున్నారు. నెలాఖరు వరకు ఎవరైనా బి ల్లులు చెల్లించకపోతే వెంటనే వారిను డిస్‌కనెక్టు జాబితాలో చేర్చి వాటిని లైన్‌మెన్లకు అప్పగిస్తున్నా రు. వెంటనే వారు ప్రతీ ఇంటికి  తిరిగి బిల్లులు వ సూలు చేస్తున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే వారి సర్వీసును తొలగిస్తున్నారు. దీంతో ప్రైవేటు సర్వీసుల నుంచి బిల్లులు దాదాపు వసూళు అవుతున్నాయి.  ప్రభుత్వ శాఖలకు చెందినవే అధికంగా పెండింగులో పడుతున్నాయి. ప్రభుత్వ రంగానికి చెందిన వసతిగృహాలు, విద్యాసంస్థలు, పోలీస్‌, రెవెన్యూ శాఖలకు సైతం ప్రతీ నెలా విద్యుత్‌ అధికారులు బకాయిలు చెల్లించాలని సమాచారం పంపినా స్పందన కరువైంది. 



Updated Date - 2021-11-27T04:22:42+05:30 IST