Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 21 Sep 2022 20:14:07 IST

వార్తాపత్రికలో పెళ్లి ప్రకటన చూసి యువతికి ఫోన్.. చివరకు తన తల్లి ఆరోగ్యం బాలేదంటూ ఆమె చెప్పిన మాటలు విని..

twitter-iconwatsapp-iconfb-icon
వార్తాపత్రికలో పెళ్లి ప్రకటన చూసి యువతికి ఫోన్.. చివరకు తన తల్లి ఆరోగ్యం బాలేదంటూ ఆమె చెప్పిన మాటలు విని.. ప్రతీకాత్మక చిత్రం

ప్రేమ, పెళ్లి పేరుతో యువకులు మోసం చేసినట్లే.. కొన్నిసార్లు యువతులు కూడా మోసాలకు పాల్పడడం అప్పడప్పుడూ జరుగుతుంటుంది. ప్రేమగా మాట్లాడుతూ చివరకు దారుణంగా మోసం చేస్తుంటారు. ఇంకొందరు మహిళలు చివరకు హత్యలకు కూడా తెగబడుతుంటారు. మధ్యప్రదేశ్‌లో ఓ యువకుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. వార్తాపత్రికలో పెళ్లి ప్రకటన చూసి యువతికి ఫోన్ చేశాడు. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. చివరకు ఓ రోజు తన తల్లికి అనారోగ్యంగా ఉందంటూ ప్రియుడికి ఫోన్ చేసింది. చివరకు ఆమె నిర్వాకంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

వార్తాపత్రికలో పెళ్లి ప్రకటన చూసి యువతికి ఫోన్.. చివరకు తన తల్లి ఆరోగ్యం బాలేదంటూ ఆమె చెప్పిన మాటలు విని..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) పితంపూర్‌లోని ఫకీర్ మొహల్లా అనే ప్రాంతానికి చెందిన అతుల్ తివారీ అనే యువకుడు చాలా కాలంగా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ  క్రమంలో ఏడాది క్రితం అతడు.. వార్తాపత్రికలో పెళ్లి ప్రకటన (Magazine advertisement) చూశాడు. అందులోని నంబర్‌కు ఫోన్ చేసి, యువతితో పరిచయం పెంచుకున్నాడు. రోజూ ఆమెతో మాట్లాడుతూ దగ్గరయ్యాడు. ఇదిలావుండగా, ఇటీవల ఓ రోజు ప్రియుడికి ఫోన్ చేసి.. తన తల్లికి అనారోగ్యంగా ఉందని, అర్జంట్‌గా డబ్బులు కావాలని అడిగింది. ఆమె మాటలు నమ్మిన యువకుడు.. వెంటనే అడిగిన మొత్తాన్ని పంపించాడు.

కాబోయే భార్యను బయటికి తీసుకెళ్లి.. తాకరాని చోట తాకడంతో పాటూ అందుకు ఒప్పుకోవాలంటూ ఒత్తిడి.. అయినా ఆమె వినకపోవడంతో..

కొన్ని రోజులకు మళ్లీ ఫోన్ చేసి, తన తల్లి చనిపోయిందని.. కర్మకాండ తదితర కార్యక్రమాలు జరిపించాలంటూ డబ్బులు అడిగింది. ఇలా దఫాలుగా మొత్తం లక్షా 7వేల రూపాయలు తీసుకుంది. తర్వాత ఏప్రిల్ నుంచి ఫోన్ స్విచ్చాఫ్ చేసింది. ఎన్నిసార్లు కలవాలని చూసినా అటువైపు నుంచి స్పందన రాలేదు. ఇటీవల ఆమె చెప్పిన అడ్రస్‌కు వెళ్లి విచారింగా.. ఆ పేరుతో అక్కడ ఎవరూ లేరని తెలిసింది. దీంతో చివరకు మోసపోయానని తెలుసుకున్న యువకుడు, పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు బాలికలకు ఇందులో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అతను నాకంటే చిన్నవాడు.. అలా చేశాడంటే ఎవరూ నమ్మరు.. అంటూ లేఖ రాసిన యువకుడు.. తప్పక ఇలా చేయాల్సి వస్తోందంటూ..


ఇవి కూడా చదవండిLatest News in Telugu

ప్రియుడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడంటూ యువతి ఆగ్రహం.. చివరకు మద్యం మత్తులో ఆమె చేసిన పని..తలుపులు వేసిన ఇంటి నుంచి వెలుతురు రావడాన్ని గమనించిన స్థానికులు.. టెర్రస్‌ పైకి వెళ్లి పరిశీలించగా షాకింగ్ సీన్.. నిర్మానుష్య ప్రదేశంలో దుస్తులు లేకుండా పడి ఉన్న బాలిక.. మాట్లాడలేని స్థితిలోనూ హావభావాల ద్వారా ఆమె చెప్పింది విని.. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో ఫొటోలు పంపిన యువతి.. మరుసటి రోజు తన వాట్సప్‌కు వచ్చిన వీడియో చూసి షాక్..Viral Video: బస్సు కింద పడుతుందేమో అని.. పిల్ల ఏనుగును ఎలా రక్షించుకుంటున్నాయో చూడండి.. videoఅక్కా! నీతో మాట్లాడాలి.. అంటూ కారులో ఊరి బయటకు తీసుకెళ్లాడు.. తన మాటకు అభ్యంతరం చెప్పడంతో చివరకు..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.