ఆలయాల్లో భద్రత ఎంత ?

ABN , First Publish Date - 2021-02-25T05:38:04+05:30 IST

భక్తుల కానుకల కు భద్రత కల్పించడం లో దేవాదాయ శాఖ అధికా రులు నిర్లక్ష్యం చూపుతున్నార నే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆలయాల్లో భద్రత ఎంత ?
ఆలయ ఆవరణలోని హుండీలు

నిత్యం ఆలయాల్లో దొంగతనాలు

హుండీల సొమ్ము కాజేస్తున్న దొంగలు 

నిర్లక్ష్యంగా ఉంటే ఆభరణాలూ చోరీ

చాలా ఆలయాల్లో సీసీ కెమెరాలు లేవు


 కరీంనగర్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 24: భక్తుల కానుకల కు భద్రత కల్పించడం లో దేవాదాయ శాఖ అధికా రులు నిర్లక్ష్యం చూపుతున్నార నే విమర్శలు వినిపిస్తున్నాయి. నిత్యం ఏదో ఒక చోట ఆలయాల్లో చోరీ లు జరుగుతున్నాయి. హుండీల డబ్బులు దోపిడీ చేస్తున్నారు. కరీంనగర్‌ పట్టణంలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో పనిచేసే 6 ఏ ఆల యాలు రెండు ఉండగా, బి ఆలయాలు 11 ఉన్నాయి. సీ ఆలయాలు లేవు. ప్రైవేట్‌ పరంగా 40 నుంచి 45 ఆలయాల వరకు ఉన్నట్లు అంచనా. అందులో 10 వరకు మంచి ఆదాయం కలిగిన ప్రైవేట్‌ దేవాలయాలున్నాయి. చాలా ఆలయా లకు సీసీ కెమెరాలు లేవు. ఉన్న ఆలయాల్లో పూర్తి స్థాయిలో పని చేయడం లేదు. హుండీలకే భద్రత లేకుంటే ఆయా ఆలయాల్లోని దేవతా మూర్తుల ఆభరణాలు, బంగారం, వెండి, ఇతర వస్తువు లకు వస్త్రాలకు భద్రత ఎలా అనే ప్రశ్నులు తలెత్తుతు న్నాయి. గతంలో పోలీసులు వచ్చి నైట్‌ వాచ్‌మన్‌లను, స్థానికులను, సిబ్బందిని లేపి మరీ రిజిస్టర్‌లో నమోదు చేసి పరిస్థితిని సమీక్షించేవారు. గస్తీ తిరిగేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిశీలన ఉండటం లేదని పలువురు ఈఓలు, ప్రైవేట్‌ ఆలయాల నిర్వాహకులు చెబుతున్నారు. 


హుండీ ఆదాయమే ఆలయ నిర్వహణకు కీలకం


దేవాలయాల నిర్వహణకు హుండీ ఆదాయమే కీలంగా ఉంది. కేటాయించిన తేదీల ప్రకారం హుండీల ను లెక్కిస్తారు. వాటిని బ్యాంకుల్లో జమచేసి సిబ్బందికి జీతాలు, ఆలయాల ఖర్చులకు కేటాయిస్తారు. ఆలయా ల్లో సరైన భద్రత లేకపోవడంతో తరచూ దొంగలు హుండీలను చోరీ చేస్తున్నారు. దీంతో ఆలయాల నిర్వహ ణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 


దేవుని ఆభరణాలు, బంగారం, వెండి విషయంలో..


అన్ని ఆలయాల్లో మొక్కుల కోసం పలువురు భక్తులు ఆభరణాలు, బంగారం, వెండి హుండీలలో వేస్తుంటారు. హుండీ లెక్కించిన సమయంలో బయటపడ్డ వాటిని స్వర్ణ కారునితో లెక్కించి బ్యాంకు లేదా ఆలయ లాకర్‌ లలో భద్ర పరుస్తారు. నిత్యం దేవతామూర్తికి అలంకరిం చే ఆభరణాల విషయంలో సదరు ఆభరణాలను అర్చకు ల స్వాధీనంలో ఉంచి తరచుగా ఆధికారులు పరిశీలి స్తుంటారు. ఆ ఆభరణాలపై ఇన్సూరెన్స్‌ కూడా చేసి వివరాలు, విలువను, సామగ్రి, వస్త్రాలు, పాత్రల వివరా లను కూడా ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.  


అన్ని ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి  

ఆకునూరి చంద్రశేఖర్‌, ఉమ్మడి జిల్లా 

దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌

భక్తుల కానుకలకు భద్రత కల్పించాల్సి బాధ్యత అధికారులపై ఉంది. ఇందు కోసం అన్ని ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయా లని ఈవోలకు ఆదేశా లిచ్చాం. కొన్ని ఆలయాల్లో కెమెరాలు లేవు. త్వరలో ఏర్పాటు చేయిస్తాం. శాఖా పరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈవోలు, అధికారులు తరచూ పర్యవేక్షిస్తుండాలి. 

Updated Date - 2021-02-25T05:38:04+05:30 IST