పథకాల అమలు ఎలా ఉంది?

ABN , First Publish Date - 2021-10-21T06:54:35+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు ఎలా ఉందని అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియాకు సంబంధించిన వైద్యాధికారుల బృందం ప్రశ్నించింది.

పథకాల అమలు ఎలా ఉంది?
మాట్లాడుతున్న డాక్టర్‌ భావన గులాటీ

అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా వైద్యాధికారుల బృందం

భూదాన్‌పోచంపల్లిలో పర్యటించిన సభ్యులు


భూదాన్‌పోచంపల్లి, అక్టోబరు 20: రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు ఎలా ఉందని అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియాకు సంబంధించిన వైద్యాధికారుల బృందం ప్రశ్నించింది. బృందం సభ్యులు భూదాన్‌పోచం పల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని బుధవారం సందర్శిం చారు. ఈ సందర్భంగా వారు పోచంపల్లి పీహెచ్‌సీలో అందిస్తున్న వైద్య సేవలు, ఇక్కడి పరిస్థితులు, ఇక్కడి ప్రజలకు వచ్చే వ్యాధులు, వాటి చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. గర్భిణులకు అందిస్తున్న సేవలు, కేసీఆర్‌ కిట్‌, నగదు ప్రోత్సాహకం వివరాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, వ్యాధుల నిర్మూలనకు, నియంత్రణకు అమలు చేస్తున్న విధానాలు, ఇక్కడ అమలు చేస్తున్న ప్రసూతి సేవలు, కోరోనా నివారణ చర్యలు, టీకాల వివరాలు సమగ్రంగా పరిశీలించారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి యాదగిరి, కాలేజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ భావన గులాటీ, సుదర్శన్‌, రిజవాన్‌ అహ్మద్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-21T06:54:35+05:30 IST