ఎంత హాయిలే ఇలా..

ABN , First Publish Date - 2022-04-24T04:16:01+05:30 IST

భగభగమండే ఎండలకు నీటిని చూస్తే ప్రాణం లేచి వస్తుంది.. ఇక ఈత కొడితే ఆ ఆనందమే వేరు.

ఎంత హాయిలే ఇలా..

  1. వేసవి తాపంతో ఎల్లెల్సీలో ఈత
  2. చిన్నా పెద్దా తేడా  లేకుండా కేరింతలు


 భగభగమండే ఎండలకు నీటిని చూస్తే ప్రాణం లేచి వస్తుంది.. ఇక ఈత కొడితే ఆ ఆనందమే వేరు.  మండలంలని దుద్ది గ్రామ సమీపంలోని రామలింగేశ్వర ఆలయం సమీపంలోని ఎల్లెల్సీలో శనివారం యువకులు, పిల్లలు ఈత కొడుతూ కేరింతలతో కనిపించారు. మండే ఎండల్లో వారు ఉష్ణ తాపం నుంచి ఉపశమనం పొందుతూ ఆనందించారు. పెద్దలు వచ్చి ఇక  ఇంటికెళ్దామని చెప్పినా.. పిల్లలు వినిపించుకోలేదు. ఇంకాసేపు అని  కాలువ నీటిలో కేరింతలు కొడుతూ సేద తీరారు.

- కోసిగి 


Updated Date - 2022-04-24T04:16:01+05:30 IST