NATUREను ఏ విధంగా రాస్తారు? పోటీ పరీక్షల కోసం!

ABN , First Publish Date - 2022-08-04T22:06:46+05:30 IST

ప్రస్తుత ప్రతి పోటీపరీక్షలోను కోడింగ్‌-డీకోడింగ్‌ విభాగానికి సంబంధించిన ప్రశ్నలు మూడు లేదా నాలుగు తప్పనిసరిగా ఉంటున్నాయి. ఈ విభాగానికి సంబంధించిన ప్రశ్నలలో ఒక పదంలోని

NATUREను ఏ విధంగా రాస్తారు? పోటీ పరీక్షల కోసం!

కోడింగ్‌ - డీకోడింగ్‌


ప్రస్తుత ప్రతి పోటీపరీక్షలోను కోడింగ్‌-డీకోడింగ్‌ విభాగానికి సంబంధించిన ప్రశ్నలు మూడు లేదా నాలుగు తప్పనిసరిగా ఉంటున్నాయి. ఈ విభాగానికి సంబంధించిన ప్రశ్నలలో ఒక పదంలోని అక్షరాలు ఒక క్రమపద్ధతి ప్రకారం మరొక అక్షరాలుగా మార్చి ఉంటాయి. వేరొక పదం ఇస్తారు. అభ్యర్థి ముందుగా మొదటిపదంలోని అక్షరాలు ఏ పద్ధతిని అనుసరించి మరొక అక్షరాలుగా మార్చారో, పరిశీలించి ప్రశ్నలో ఇచ్చిన వేరొకపదంలోని అక్షరాలను అదే పద్ధతిని అనుసరించి, మరొక అక్షరాలుగా రాయాలి. ఒక్కోసారి పదంలో గల అక్షరాలను అంకెలలోకి కూడా మారుస్తారు. అభ్యర్థి ఆ అంకెలను పరిశీలించి, ప్రశ్నగా ఇచ్చిన వేరొక పదంలోని అక్షరాలను అదే పద్ధతిని అనుసరిస్తూ అంకెలలోకి మార్చాలి. ఈ విభాగానికి సంబంధించిన ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాన్ని అతి త్వరగా రాబట్టడం ఎంతో ముఖ్యం. ఇందుకోసం అభ్యర్థులకు వర్ణమాల యొక్క సవ్యదిశ అక్షరాలకు, అపసవ్యదిశ అక్షరాలకు సంఖ్యలు తెలిసి ఉండటం చాలా అవసరం.


వర్ణమాల - వాటి సంఖ్యలు

1   2   3   4   5   6   7   8   9   10   11   12   13    14  

A  B  C   D  E   F  G  H   I     J     K    L     M    N

26  25  24  23  22  21  20  19  18  17  16  15   14  13

15  16  17  18  19  20  21  22  23  24  25  26

O   P    Q    R    S   T   U   V   W   X   Y   Z 

12  11  10   9     8   7   6    5    4    3     2   1


గమనిక: పై వర్ణమాలలో 1 నుంచి 26 అనగా సవ్యదిశ అని, వర్ణమాలకు కింద ఇచ్చిన సంఖ్యలు 26 నుంచి 1 అనేవి అపసవ్యదిశ అని అర్థం.


గమనించండి 27 రూల్‌

పై వర్ణమాలలో ఏ అక్షరాన్ని పరిశీలించినా... ఆ అక్షరానికి పైన, కింద ఇచ్చిన సంఖ్యలను కూడితే ఆ మొత్తం విలువ 27 అని తెలుస్తోంది. అభ్యర్థి సవ్యదిశ వర్ణమాల యొక్క అక్షరాలకు (A to Z) సంఖ్యలను నేర్చుకుంటేఅపసవ్యదిశ వర్ణమాలకు సంఖ్యలను తెలుసుకోవడం చాలా సులువు.


ఉదాహరణకు P యొక్క సంఖ్య 16 అని మీకు తెలిసినప్పుడు రెండో వైపు నుంచి తెలుసుకోవాలంటే 27 నుంచి 16ను తీసివేస్తే 27-16=11 అని చెప్పడం చాలా సులువు. అదేవిధంగా ఒ యొక్క సంఖ్య 10 అని మీకు తెలిసిన రెండోవైపు నుంచి తెలుసుకోవాలంటే 27-10=17 ఈ విధంగా J 27రూల్‌ ద్వారా ఒకవైపు అక్షరాలకు సంఖ్యలు నేర్చుకుంటే రెండోవైపు అక్షరాలకు సంఖ్యలను తెలుసుకోవడం చాలా సులువు. 


E   J     O     T    Y

5  10  15  20  25  కనీసం ఈ అక్షరాలకైనా అంకెలను బాగా గుర్తుపెట్టుకొంటే ఆ అక్షరాలకు కుడి, ఎడమలలో ఉండే అక్షరాల అంకెలను సులభంగా గుర్తించగలం.


ఉదా: G అక్షరానికి సంఖ్య కావాలంటే E తరవాత 2వది. E అనగా 5, 5+2=7, G అనగా 7వ అక్షరం. ఈ విధంగా EJOYలో గల ప్రతి అక్షరానికి ఇరువైపుల గల అక్షరాల సంఖ్యలను గుర్తించడం సులువుగా ఉంటుంది. 


+1 రూల్‌: ఏదేని ఒక అక్షరాన్ని దాని తదుపరి అక్షరంగా రాయడం లేదా 1వ అక్షరాన్ని 2వ అక్షరంగా, 2వ అక్షరాన్ని 3వ అక్షరంగా రాయడం.

ఉదా: A ను B గాను, B  ను C గాను, C ను D గాను రాయడం.


+2 రూల్‌: ఏదేని ఒక అక్షరానికి +2 అక్షరం కావాలంటే ఇచ్చిన అక్షరానికి తదుపరి అక్షరం వదిలివేసి, వదిలివేసిన అక్షరానికి తదుపరి అక్షరంగా రాయడం లేదా 1వ అక్షరాన్ని 3వ అక్షరంగా, 3వ అక్షరాన్ని 5వ అక్షరంగా ఆవిధంగా రాయడం.

ఉదా: A ను C గాను, C ను E గాను రాయడం


+3 రూల్‌: ఏదేని ఒక అక్షరానికి +3 అక్షరం కావాలంటే ఇచ్చిన అక్షరానికి తరవాత రెండు అక్షరాలు వదిలివేసి, వదిలివేసిన అక్షరాలకు తదుపరి అక్షరంగా రాయడం లేదా 1వ అక్షరాన్ని 4వ అక్షరంగా, 4వ అక్షరాన్ని 7వ అక్షరంగా ఆ విధంగా రాయడం.

ఉదా: A ను D గాను, D ను E గాను రాయడం


-1 రూల్‌: ఏదేని ఒక అక్షరానికి దాని వెనుక అక్షరంగా రాయడం లేదా 4వ అక్షరాన్ని 3వ అక్షరంగా, 3వ అక్షరాన్ని 2వ అక్షరంగా ఆ విధంగా రాయడం.

ఉదా: Dను C గాను,  C ను B గాను రాయడం.


-2 రూల్‌: ఏదేని ఒక అక్షరానికి -2 అక్షరం కావాలంటే ఇచ్చిన అక్షరానికి వెనుక ఒక అక్షరం వదిలివేసి, వదిలివేసిన అక్షరానికి వెనుక అక్షరంగా రాయడం లేదా 10వ అక్షరాన్ని 8వ అక్షరంగా, 8వ అక్షరాన్ని 6వ అక్షరంగా ఆ విధంగా రాయడం.

ఉదా: J ను H గాను, H ను F గాను రాయడం.


-3 రూల్‌: ఏదేని ఒక అక్షరానికి -3 అక్షరం కావాలంటే ఇచ్చిన అక్షరానికి వెనుక రెండు అక్షరాలు వదిలివేసి, వదిలివేసిన అక్షరాలకు వెనుక అక్షరంగా రాయడం లేదా 10వ అక్షరాన్ని 7వ అక్షరంగా, 7వ అక్షరాన్ని 4వ అక్షరంగా రాయడం.

ఉదా: J ను G గాను, G ను D గాను రాయడం.


+ అనగా ఏదేని అక్షరానికి కుడివైపు వచ్చే అక్షరాలు అని, 

- అనగా ఏదేని అక్షరానికి ఎడమవైపువచ్చే అక్షరాలు అని అర్థం.

గమనిక: A to Z  అక్షరాల తరవాత ఇంకా అక్షరాలు అవసరమైతే Z 26వ అక్షరం తదుపరి మరల Aను 27వ అక్షరంగా, Bను 28వ అక్షరంగా ఆ విధంగా భావించాలి.

ఉదా: Yకు +3 అవసరమైతే Yకు తదుపరి అక్షరం Zను +1గా, తదుపరి Aను +2 అక్షరంగా, తదుపరి Bను +3 అక్షరంగా భావించాలి. Yకు +3 అనగా Z, Aల తదుపరి B అక్షరం అవుతుంది.

ఉదా: Bకు -3 అక్షరం అవసరమైతే Bకు వెనుక A ను-1 గాను, Aకు వెనుక Zను -2గాను, Zకు వెనుక Yను -3 గాను భావించాలి. B  కు -3 అనగా A, Z వెనుక Y అక్షరం  అవుతుంది.


కోడింగ్‌ - డీకోడింగ్‌ ప్రశ్నలకు ముఖ్యంగా ఒక పదంలోని అక్షరాలు ఒక పద్ధతి ప్రకారం మరొక అక్షరాలుగా మార్చే విధానంలో సమాధానాలు రాబట్టాలంటే గమనించాల్సిన అంశాలు, పద్ధతులు. 

1. ఈ విభాగంలో ప్రశ్నలు (ఎ) మొదటి నుంచి చివరకు లేదా (బి) చివరి నుంచి మొదటకు +గా లేదా ‘-’ లుగా ఉంటాయి.

2. సవ్యదిశ అక్షరాలకు అపసవ్యదిశ అక్షరాలు రాయడం.

3. ముందుగా ప్రశ్నలోని అక్షరాలను తదుపరి అక్షరాలుగా లేదా వెనుక అక్షరాలుగా రాస్తే.. తదుపరి ప్రతి రెండు అక్షరాలను రివర్స్‌ చేయడం. (క్రాస్‌ మెథడ్‌)

4. పదంలోని అక్షరాలనే స్థానాలు మార్చి రాయడం.

5. ఒకే పదంలోని అక్షరాలను +గా లేదా -గా(తదుపరి అక్షరాలుగా లేదా వెనుక అక్షరాలుగా) మార్చిన తరవాత ఏర్పడే అక్షరాలలో మొదటి అర్థభాగాన్ని అదే స్థానంలో, రెండో అర్థభాగాన్ని అదే స్థానంలో రివర్స్‌ చేయడం. 

6. ఒక పదంలోని అక్షరాలను +గా లేదా - గా (తదుపరి లేదా వెనుక అక్షరాలుగా) మారిన తరవాత ఏర్పడే అక్షరాలలో మొదటి అర్థభాగాన్ని రెండో అర్థభాగం స్థానంలో, రెండో అర్థభాగాన్ని మొదట అర్థభాగం స్థానంలో మార్పిడి(తారుమారు) చేయడం. 

గమనిక: ఒకవేళ ఇచ్చిన పదంలో అక్షరాల సంఖ్య బేసిగా ఉంటే మధ్య అక్షరం స్థిరంగా ఉంటుంది.  దానికి ఎడమవైపు అక్షరాలు, కుడివైపు అక్షరాలు 5, 6 పద్ధతులలో చెప్పినవిధంగా మారతాయి.

ఇంకా చాలా రకాలుగా ప్రశ్నలు ఉంటాయి. కనీసం పైన పేర్కొన్న పద్ధతులపై పూర్తి అవగాహన కలిగి ఉంటూ అక్షరాల అంకెలపై (సవ్య, అపసవ్యదిశ) అపారమైన పరిజ్ఞానం కలిగి ఉంటే దాదాపు ప్రశ్నలోని అక్షరాలను ఏవిధంగా మార్చినా తెలుసుకోవడం చాలా వరకు సుసాధ్యమే. 

ఇప్పుడు పైన పేర్కొన్న 6 పద్ధతులకు సంబంధించిన ప్రశ్నలను వివరణలతో పరిశీలిద్దాం. 


1. (ఎ) మొదటి నుంచి చివరకు:

ఉదా: ఒక సంకేత భాషలో PUBLICను QVCMJDగా రాసిన అదే సంకేత భాషలో NATURE ను ఏవిధంగా రాస్తారు?


ఎ) OBUVSF బి)UVBSFO 

సి) OBVUFS డి) FSVUBO


సమాధానం: (ఎ)

వివరణ: PUBLICను QVCMJDగా రాయడం అనగా PUBLIC అనే పదం మొదటి నుంచి అనగా p నుంచి C వరకు గల అక్షరాలను +1 అక్షరాలుగా అనగా తదుపరి అక్షరాలుగా రాశారు. Pకు తదుపరి అక్షరం Q, U కు తదుపరి అక్షరం V, Bకు తదుపరి అక్షరం C, Lకు తదుపరి అక్షరం M, Iకు తదుపరి అక్షరం  J, Cకు తదుపరి అక్షరం D. ఈ విధంగా NATURE అనే పదంలో ప్రతి అక్షరాన్ని తదుపరి అక్షరంగా రాస్తే సమాధానం OBUVSF అవుతుంది.




గా రాస్తారు.

పై సంఖ్యలు, కింది సంఖ్యలు గమనిస్తే +1 అని తెలుస్తోంది.


1. (బి) చివరి నుంచి మొదటకు

ఉదా: ఒక సంకేత భాషలో GENIUSను TVJOFHగా రాశారు. అయితే అదే సంకేత భాషలో MOBILEను ఏ విధంగా రాస్తారు?


ఎ) FJMCNP బి) MFCJNP  సి) FMJCPN డి)JCMFNP

సమాధానం: (సి)


వివరణ: GENIUSను TVJOFHగా రాయడం అంటే GENIUSఅనే పదంలో చివరి నుంచి అనగా  S నుంచి G వరకు గల అక్షరాలను +1 అక్షరాలుగా అనగా తదుపరి అక్షరాలుగా రాశారు. GENIUSలో చివరి అక్షరం S నుంచిపరిశీలిస్తే Sకు తదుపరి అక్షరం T, Uకు తదుపరి అక్షరం V, I కు తదుపరి అక్షరం J, Nకు తదుపరి అక్షరం O, Eకు తదుపరి అక్షరం F, GMకు తదుపరి అక్షరం H. ఈవిధంగా GENIUSను TVJOFHగా రాశారు. ఇదే విధంగా MOBILEఅనే పదంలో కుడి నుంచిఎడమకు అంటే E నుంచి M  వరకు గల అక్షరాలకు తదుపరి అక్షరాలను రాసిన సమాధానం FMJCPN అవుతుంది.



2. సవ్యదిశ అక్షరాలకు అపసవ్యదిశ(వ్యతిరేకదిశ) అక్షరాలు రాయడం:-

ఉదా: ఒక సంకేత భాషలో  FAMEను  UZNVగా రాస్తే అదే సంకేతభాషలో HELPను ఏ విధంగా రాస్తారు?

ఎ)  VSKO      బి)SVOK    సి) OVSK      డి) SOKV


సమాధానం: (బి)

వివరణ: FAMEను UZNVగా రాయడం అంటే

F  అనేది 6వ అక్షరం.  

U అనేది అపసవ్యదిశలో (చివరి నుంచి) 6వ అక్షరం. 

A అనేది 1వ అక్షరం.  

Z అనేది అపసవ్యదిశలో (చివరి నుంచి) 1వ అక్షరం.

M అనేది 13వ అక్షరం.  

N అనేది అపసవ్యదిశలో (చివరి నుంచి) 13వ అక్షరం.

V  అనేది 5వ అక్షరం.

గ అనేది అపసవ్యదిశలో(చివరి నుంచి) 5వ అక్షరం.

ఈవిధంగా FAMEఅనేది UZNVగా రాశారు. ఇదే విధంగా HELP అనే పదంలో

H అనేది 8వ అక్షరం.  

S అనేది అపసవ్యదిశలో (చివరి నుంచి) 8వ అక్షరం.

E అనేది 5వ అక్షరం.  

V అనేది అపసవ్యదిశలో (చివరి నుంచి) 5వ అక్షరం.

L అనేది 12వ అక్షరం.  

O అనేది అపసవ్యదిశలో (చివరి నుంచి) 12వ అక్షరం.

P అనేది 16వ అక్షరం.  

K  అనేది అపసవ్యదిశలో (చివరి నుంచి) 16వ అక్షరం.

3.  పదములోని అక్షరాలకు తదుపరి అక్షరాలుగా లేదా వెనుక అక్షరాలుగా రాసి ప్రతి రెండు అక్షరాలను రివర్స్‌ చేయడం (క్రాస్‌ మెథడ్‌).

ఉదా 3: ఒక సంకేతభాషలో MEDIUMను FNJENVగా రాస్తే, అదే సంకేతభాషలో INCOMEను ఏవిధంగా రాస్తారు?

ఎ) OPDFJN  బి) JODPNF  సి)OJPDFN   డి) JPOFDN

సమాధానం: (సి)

వివరణ: MEDIUMను FNJENVగా రాయడం అనగా MEDIUMలోని ప్రతి అక్షరానికి +1 అక్షరాన్ని రాస్తే అనగా తదుపరి అక్షరాలుగా రాస్తే NFEJVN.. దీనిలోని ప్రతి రెండు అక్షరాలను రివర్స్‌లో రాస్తే FNJENV అవుతుంది. ఇదే విధంగా INCOMEలోని ప్రతి అక్షరానికి తదుపరి అక్షరం రాసిన JODPNF దీనిలోని ప్రతి రెండు అక్షరాలను రివర్స్‌లో రాస్తే సమాధానం OJPDFN అవుతుంది.

4.  పదములోని అక్షరాలనే స్థానాలు మార్పుచేసి రాయడం:-

ఉదా: ఒక సంకేతభాషలో PRIVATEను ARPTIEVగా రాస్తే అదే సంకేతభాషలో  MISTAKE ను ఏవిధంగా రాస్తారు?

ఎ) IASKMTE బి) AIMKSET 

సి)  MSKTIAE డి) ఏదీకాదు. సమాధానం: (బి)

వివరణ: PRIVATEను ARPTIEVగా రాయడం అంటే ఆ పదంలోని అక్షరాలనే స్థానాలను మార్పుచేసి రాసారు.

PRIVATEఅనే పదంలోని అక్షరాలకు 1 2 3 4 5 6 7 అనే సంఖ్యలను ఇచ్చిన ARPTIEV అనేది  5 2 1 6 3 7 4.

1  2 3 4 5  6 7 -  5  2  1  6 3  7  4 

P  R I V A T E -  A  R  P  T  I  E  V  

ఇదేవిధంగా

1  2 3 4  5 6  7      - 5  2   1   6  3  7  4 

M I S T  A K E - A  I    M   K  S  E  T

సమాధానం అవుతుంది.

5. పదంలోని అక్షరాలను +గా లేదా - గా (తదుపరి లేదా వెనుక అక్షరాలుగా) మార్చిన తరవాత మొదటి అర్థభాగం, రెండో అర్థ భాగం అదే స్థానంలో రివర్స్‌ చేయడం :-

ఉదా: ఒక సంకేతభాషలో JUNIORను  OVKSPJగా రాస్తే అదే సంకేత భాషలో RADIUMను ఏవిధంగా రాస్తారు?

ఎ)  EBSNVJ    బి)ESBVJN    సి) SBENJV   ఏదీకాదు.

సమాధానం: (ఎ) 

వివరణ: ముందుగా JUNIOR అనే పదంలోని అక్షరాలను +1 చేయగా అంటే తదుపరి అక్షరాలుగా రాయగా KVOJPS. వీటిలో మొదటి అర్థభాగాన్ని రివర్స్‌ చేయగా OVK  రెండో అర్థభాగాన్ని రివర్స్‌ చేయగా SPJ. ఈవిధంగా JUNIOR అనే పదం OVKSPJగా కోడ్‌ చేయబడినది. అదే విధంగా RADIUM అనే పదంలోని అక్షరాలను +1 చేయగా అనగా తదుపరి అక్షరాలుగా రాసిన SBEJVN. ఈ అక్షరాలలో మొదటి అర్థభాగాన్ని రివర్స్‌ చేయగా EBS. రెండవ అర్థభాగాన్ని రివర్స్‌ చేయగా NVJ. కావున సమాధానం EBSNVJ  అవుతుంది.  దీనినే మరొక విధంగా కూడా చూపవచ్చు. 




6. ఒక సంకేత భాషలో ORANGEను OHFPSBగా రాస్తే అదే సంకేత భాషలో ANCHORను ఏ విధంగా రాస్తారు?

ఎ) IPRBPD  బి)  IPSBOD   సి)  ISPBDO  డి) PSIODB

సమాధానం: (బి)

వివరణ: ముందుగా ORANGE అనే పదంలోని అక్షరాలను +1 చేయగా అనగా తదుపరి అక్షరాలుగా రాయగా  PSBOHF. ఈ అక్షరాలలో మొదటి అర్థభాగాన్ని రెండో అర్థభాగం స్థానంలో, రెండో అర్థభాగాన్ని మొదటి అర్థభాగం స్థానంలోకి మార్పిడి చేసిన OHFPSB  అయింది. అదే విధంగా ANCHORలోని అక్షరాలను +1 చేయగా అనగా తదుపరి అక్షరాలుగా రాయగా BODIPS ఈ అక్షరాలలో మొదటి అర్థభాగాన్ని రెండో అర్థభాగం స్థానంలో, రెండో అర్థభాగాన్ని మొదటి అర్థభాగంలోకి మార్పిడి చేసిన IPSBOD సమాధానం అవుతుంది.


-పండిటి మీనాక్షి పవన్‌

సీనియర్‌ ఫ్యాకల్టీ



Updated Date - 2022-08-04T22:06:46+05:30 IST