సభ్యుల తీర్మానం లేకుండా రుణం ఎలా ఇస్తారు?

ABN , First Publish Date - 2022-01-28T05:15:28+05:30 IST

మహిళా గ్రూప్‌ సభ్యులకు తెలుపకుండా, గ్రూప్‌ తీర్మానం లేకుండా సభ్యురాలికి రుణం ఎలా మంజూరు చేస్తారని గురువారం ఏపీఎంను మహిళలు ప్రశ్నించారు.

సభ్యుల తీర్మానం లేకుండా రుణం ఎలా ఇస్తారు?

 చిల్‌పచెడ్‌, జనవరి 27: మహిళా గ్రూప్‌ సభ్యులకు తెలుపకుండా, గ్రూప్‌ తీర్మానం లేకుండా సభ్యురాలికి రుణం ఎలా మంజూరు చేస్తారని గురువారం ఏపీఎంను మహిళలు ప్రశ్నించారు. చిల్‌పచెడ్‌ మండలం గౌతాపూర్‌ గ్రామానికి చెందిన సరస్వతీ గ్రూప్‌ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రూప్‌ బ్యాంక్‌ ఖాతాలో పది నెలల క్రితం రూ.లక్ష లోన్‌ మంజూరయింది. ఆ విషయం సభ్యులకు తెలీదు. అయితే ఆ లోన్‌కు సంబంధించి ఓడీ కట్టాలని అధికారులు సూచించడంతో అవాక్కయ్యారు. బ్యాంకుకు వెళ్లి చూడగా అసలు విషయం బయటపడింది. దీంతో మండలకేంద్రంలోని ఏపీఎం ప్రేమలతను కలిసి గ్రూప్‌ సభ్యులకు తెలియకుండా లోన్‌ ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు. ఆ లోన్‌కు, తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఈ విషయంమై ఏపీఎం ప్రేమలత మాట్లాడుతూ..  గ్రూప్‌లో ఉన్న ఓ సభ్యురాలికి లోన్‌ మంజూరయిందని చెప్పారు. ఆ సభ్యురాలు హైదరాబాద్‌లో ఉంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆమెకు లోన్‌ ఎలా మంజూరయ్యిందో పూర్తిగా విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. 


Updated Date - 2022-01-28T05:15:28+05:30 IST