శామీర్పేట రూరల్: ఒంటిపై కిరోసిన్ పోసుకుని గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆద్రా్సపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. ఎంసీపల్లి మండలం ఆద్రా్సపల్లి గ్రామానికి చెందిన సీహెచ్ లక్ష్మి(50) భర్త శ్రీనివాస్ కొడుకు సాయికుమార్లు ఉన్నారు. ఆమె గత కొంత కాలంగా మతిస్థిమితం సరిగా లేక అనారోగ్యంతో బాధపడుతోంది. ఆదివారం ఇంట్లో భర్తతో గొడవపడింది. సోమవారం ఉదయం ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన కుటుంబీకులు, స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ విషయమై పోలీసులను ఆరాతీయగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.