జలదిగ్బంధంలో ఇళ్లు

ABN , First Publish Date - 2020-09-30T11:28:01+05:30 IST

నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె మేజర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని గణపతినగర్‌, సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ వీధి, భారత్‌గ్యా్‌సవీధి, గౌతమ్‌ స్కూల్‌ వీధులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

జలదిగ్బంధంలో ఇళ్లు

పరిశీలించిన సబ్‌కలెక్టర్‌


నందలూరు, సెప్టెంబరు 29 : నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె మేజర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని గణపతినగర్‌, సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ వీధి, భారత్‌గ్యా్‌సవీధి, గౌతమ్‌ స్కూల్‌ వీధులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక్కడి ప్రజలు అవస్థలు పడుతున్న విషయం తెలుసుకున్న రాజంపేట సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ నీటమునిగిన నివాస గృహాలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ బాహుదా నది నుంచి కన్యకా చెరువుకు నీటిని తరలించే ప్రధాన కాలువ పూడిక తీత పనులు అస్తవ్యస్తంగా చేయడంతో ఆ కాలువ పొంగి నీళ్లు నివాస ప్రాంతాల్లోకి చేరాయన్నారు. ఆర్‌.ఎ్‌స.రోడ్డులో దాదాపు 11కాలువలు ఆక్రమణకు గురయ్యాయని, అందువల్ల బాహుదానది పారినప్పుడు నీళ్లు ఇళ్లల్లోకి వచ్చేస్తున్నాయని అన్నారు. సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ మాట్లాడుతూ ఇరిగేషన్‌ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కాలువలు ఆక్రమణకు గురయ్యాయని, ఇందులో ప్రజల తప్పు కూడా ఉందని అన్నారు. త్వరలో సర్వే నిర్వహించి గతంలో ఉన్న కాలువలన్నీ పునరుద్ధరిస్తామన్నారు. ప్రస్తుతం నీట మునిగిన ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2020-09-30T11:28:01+05:30 IST