సరిహద్దుల్లో పాక్ కాల్పులు..కథువాలో ఇళ్ల ధ్వంసంపై ప్రజాగ్రహం

ABN , First Publish Date - 2020-08-22T10:56:49+05:30 IST

జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి....

సరిహద్దుల్లో పాక్ కాల్పులు..కథువాలో ఇళ్ల ధ్వంసంపై ప్రజాగ్రహం

కథువా (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. కథువా జిల్లా హీరానగర్ తహసీల్ పరిధిలో చక్ చంగా సరిహద్దు గ్రామంలో పాక్ సైనికులు షెల్లింగులతో కాల్పులకు దిగారు. ఈ కాల్పుల వల్ల తమ ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని సరిహద్దు గ్రామవాసి ధర్మపాల్ ఆవేదనగా చెప్పారు. పాకిస్థాన్ సైనికులు తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, ఈ కాల్పుల వల్ల తమ ఇళ్లు దెబ్బతిన్నాయని ధర్మపాల్ చెప్పారు. ఇలా తరచూ కాల్పులు జరుపుతుంటే తాము ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. పాక్ కాల్పులపై సరిహద్దు గ్రామాల ప్రజలు పాకిస్థాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేసి నిరసన తెలిపారు. రాత్రి వేళ 10 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు పాక్ సైనికులు కాల్పులు జరపడం వల్ల ఇళ్లు, దేవాలయాలు దెబ్బతిన్నాయని, రాత్రివేళ తమకు కంటిపై కునుకు లేకుండా పోతుందని చక్ చాంగ్ నివాసి ఆవేదనగా చెప్పారు. పూంచ్ జిల్లా మాన్ కోటి సెక్టారులోని నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనికులు మోర్టార్లు, షెల్లింగులతో కాల్పులు జరిపారు.

Updated Date - 2020-08-22T10:56:49+05:30 IST