అత్తంటి వేధింపులు తాళలేక..

ABN , First Publish Date - 2021-06-20T06:11:41+05:30 IST

భర్త చనిపోయిన బాధ ఓ వైపు.. కుటుంబసభ్యుల వేధింపులు మరో వైపుతో మనస్తాపానికి గు రైన కంచర్ల అంజలి(30) అనే మహిళ శనివారం గుండ్లకమ్మ నదిలో దూకి ఆ త్మహత్య చేసుకుంది.

అత్తంటి వేధింపులు తాళలేక..
మృతి చెందిన కంచర్ల అంజలి

మనస్తాపంతో మహిళ ఆత్మహత్య

కుటుంబసభ్యుల వేధింపులే కారణం అంటున్న బంధువులు


అద్దంకి, జూన్‌ 19: భర్త చనిపోయిన బాధ ఓ వైపు.. కుటుంబసభ్యుల వేధింపులు మరో వైపుతో మనస్తాపానికి గు రైన కంచర్ల అంజలి(30) అనే మహిళ శనివారం గుండ్లకమ్మ నదిలో దూకి ఆ త్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు అద్దంకి పట్టణంలోని రాజీవ్‌కాలనీకి చెందిన కంచర్ల రమేష్‌కు 10 సం వత్సరాల క్రితం సంతనూతలపాడుకు చెందిన అంజలితో వివాహం జరిగింది.  వీరి కి ఇద్దరు కుమారులు  ఉన్నారు. మూడు నెలల క్రితం రమేష్‌ గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో ఇద్దరు కుమారుల భారం అంజలిపై పడింది. సుమారు 80  వేల రూపాయలు ఖర్చు చేసి భర్త దశదినకర్మ చేసింది. భర్త చనిపోయి ఉండటంతో ఈ నెల 15వ తేదీ  పుట్టింటి వద్ద నిద్ర చేసి అద్దంకికి వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి  అత్త, కుటుంబసభ్యులు సూటీపోటీ మాటలతో వేధిస్తున్నారని అంజలి శుక్రవారం రాత్రి తల్లిదండ్రులైన  కొత్తపల్లి హనుమాయమ్మ, వెంకటేశ్వర్లుకు ఫోన్‌ చేసి విలపించింది. శనివారం ఉదయం మరోసారి ఫోన్‌ చేసి ఇక  నేను బతకను అని చెప్పింది. అద్దంకి-తిమ్మాయపాలెం మధ్య ఉన్న గుండ్లకమ్మ బ్రిడ్జి వద్దకు శనివారం ఉదయం చేరుకున్న అంజలి ఫోన్‌ అక్కడ పెట్టి నదిలోకి దూకింది.  ఇది గమనించిన స్థానికు లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని ఫోన్‌ పరిశీలించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి అంజలి మృతదేహాన్ని బయటకు తీశారు. అంజలి తల్లి హనుమాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు  చేసినట్లు ఎస్సై మహేష్‌  తెలిపారు. కుటుంబ సభ్యుల వేధింపులతోనే తమ కుమార్తె మృతి చెందిందని తల్లిదండ్రులు,  కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 


Updated Date - 2021-06-20T06:11:41+05:30 IST