Abn logo
Apr 13 2021 @ 01:22AM

గ్రామంలోనే స్థలాలు మంజూరు చేయాలి

మామిడికుదురు, ఏప్రిల్‌ 12: గ్రామంలోనే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని మొగలికుదురు గ్రామ మహిళలు సోమవారం తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. 12కిలోమీటర్ల దూరంలో ఈదరాడలో  ఇచ్చిన  ఇళ్లస్థలాల పట్టాలను తహశీల్దార్‌ ఎం.సుజాతకు తిరిగి ఇచ్చేశారు.  గ్రామంలో స్థలం లేకపోవడంతో  వేరే గ్రామంలో ఇచ్చామని, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని తహశీల్దార్‌ తెలిపారు. కార్యక్రమంలో స్థానికులు, మహిళలు, లబ్ధిదారులు  పాల్గొన్నారు.Advertisement
Advertisement
Advertisement