Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇల్లు అమ్ముతానని OLX లో ప్రకటన.. ఓ మహిళ నుంచి ఫోన్.. లింక్ ఓపెన్ చేయగా..!

హైదరాబాద్ సిటీ : ఇల్లు కొనుగోలు చేస్తామని రూ. లక్షన్నర కాజేశారు. సికింద్రాబాద్‌కు చెందిన ఒకరు ఇటీవల ఇల్లు అమ్ముతానని ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన పెట్టాడు. రెండు రోజుల క్రితం సునీతాకుమారి అనే మహిళ ఫోన్‌ చేసి ఆర్మీలో పని చేస్తున్నానని, ఇల్లు కొనుగోలు చేస్తానని చెప్పింది. ధర మాట్లాడుకున్న తర్వాత తాను మొబైల్‌కు ఓ లింక్‌ పంపిస్తున్నానని, ఆ లింక్‌ ద్వారా రూ. 10 పంపిస్తే, రూ. 2 లక్షలు పంపిస్తానని నమ్మించింది. చెప్పినట్లే చేయగా, లింక్‌ను క్లిక్‌ చేసిన బాధితుడు డెబిట్‌ కార్డు వివరాలు చేశాడు. దీంతో విడతల వారీగా రూ. లక్షన్నర వరకు అకౌంట్‌ నుంచి డెబిట్‌ అయ్యాయి. దీంతో బాదితుడు మహిళ నెంబర్‌కు ఫోన్‌చేయడానికి ప్రయత్నించగా, స్విచ్ఛాఫ్‌ వచ్చింది. మోసపోయానని గ్రహించిన బాదితుడు సిటీ సైబర్‌క్రైమ్స్‌లో సోమవారం ఫిర్యాదు చేశాడు. 

TAGS: OLX
Advertisement
Advertisement