నివాసయోగ్యం కానిచోట ఇళ్ల స్థలాలా?

ABN , First Publish Date - 2021-04-21T06:08:49+05:30 IST

నివాసయోగ్యం కానిచోట ఇళ్ల స్థలాలా?

నివాసయోగ్యం కానిచోట ఇళ్ల స్థలాలా?
బోరు పనులు అడ్డుకున్న గ్రామస్థులు

 కంకిపాడు, ఏప్రిల్‌ 20 : నివాసయోగ్యం కానిచోట తమకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తారా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఉన్న స్థలాన్ని ఇళ్ల స్థలాల కోసం లాగేసుకుంటారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సదరు భూమిలో బోరు వేసేందుకు వచ్చిన ఆర్‌డబ్య్లూఎస్‌, రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. మండలంలోని వేల్పూరు     గ్రామ పరిధిలోని 64 సెంట్ల రెవెన్యూ పోరంబోకు స్థలాన్ని ఆ గ్రామ మహిళలు బహిర్భూమిగా వినియోగించునే వారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ తీసుకున్న నిర్ణయంలో అధికారులు సదరు భూమిని 27 మందికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్లాట్లు రూపంలో రూపాంతరం జరిగిపోయింది. రోడ్లు వేశారు. ఇక బోరు వేసేందుకు అవసరమైన యంత్రాలతో మంగళవారం ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారి సుబ్బారావు, ఇన్‌చార్జి వీఆర్వో దుర్గారావమ్మ అక్కడికి చేరుకున్నారు. దళితులు బహిర్భూమిగా వినియోగించుకునే భూమిని ఇళ్ల స్థలాలకు కేటాయిస్తారంటూ అంటూ గ్రామస్థులు కొందరు అక్కడికి చేరుకున్నారు. బోరు ఏర్పాట్లను అడ్డుకున్నారు. అయితే ఇళ్ల స్థలాలకు అవసరమైన మంచినీటి ఏర్పా టుకు అవసరమైన బోరు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బోరు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనికి గ్రామస్థులు ససేమీరా అన్నారు.  తమకు రెండు రోజులు కేటాయించాలని ఎమ్మెల్యే కొలుసు పార్థ సారథి దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లి పరిష్కరించుకుంటామని చెప్పారు. దీంతో వీఆర్వో సమస్యను తహసీల్దార్‌ టి.వి.సతీష్‌ దృష్టికి తీసుకువెళ్లారు. రెండు రోజుల గడువు ఇస్తూ సంబంధిత అధికారులను తిరిగి రావాలని తహసీల్దార్‌ ఆదేశించారు. 

Updated Date - 2021-04-21T06:08:49+05:30 IST