Abn logo
Jan 23 2021 @ 23:47PM

‘పోలవరం గట్లుపై ఇళ్ల స్థలాలు వద్దు’

గండేపల్లి, జనవరి 23: తమకు పోలవరం గట్లుపై కేటాయించిన ఇళ్ల స్థలాలు వద్దంటూ మల్లేపల్లికి చెందిన లబ్ధిదారులు శనివారం ఆందోళన చేపట్టారు. ఈ మేరకు తహశీల్దార్‌ చిన్నారావుకు పలువురు మహిళలు వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ పోలవరం గట్లుపై ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోవాలంటే పునాదికి సుమారు 30 అడుగుల లోతు గోతులు తీయాలన్నారు. అక్కడ ఇళ్లు నిర్మించుకోవడం అంతా క్షేమం కాదన్నారు. కొన్ని గ్రామాల్లో నాణ్యమైన పొలాలు కొనుగోలు చేసి స్థలాలు పంపిణీ చేస్తుంటే మల్లేపల్లిలో మాత్రం పోలవరం గట్లు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. అధికారులు స్పందించి సురక్షితమైన ప్రదేశంలో తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లబ్ధిదారులు కోరారు.

Advertisement
Advertisement
Advertisement