జగనన్నా.. గూడు ఏదీ?

ABN , First Publish Date - 2022-07-19T05:16:08+05:30 IST

‘కులం చూడం.. మతం చూడం.. పార్టీ చూడం.. ప్రాం తం చూడం.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల కాలనీలు మం జూరు చేస్తాం’ అన్న ముఖ్యమంత్రి జగన్‌ ప్రక టనలు ఆచరణకు దూరమవుతున్నాయి. పేద లకు పూర్తిస్థాయిలో ఇళ్లు మంజూరు చేయలేదు సరికదా.. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో, హుద్‌హుద్‌ ఇళ్ల కాలనీలు సైతం అర్హు లకు కేటాయించని పరిస్థితి నెలకొంది. దీంతో చాలామంది గూడులేని అభాగ్యులుగా మిగిలి పోతున్నారు.

జగనన్నా.. గూడు ఏదీ?
చేపల మార్కెట్‌ సముదాయంలో ఉంటున్న వృద్ధుడి కుటుంబం

 దరఖాస్తు చేసుకున్నా మంజూరుకాని ఇల్లు
 చేపల మార్కెట్‌ సముదాయంలో తలదాచుకుంటున్న కుటుంబం
 టెక్కలిలో వృద్ధ దంపతుల దీనస్థితి
(టెక్కలి/టెక్కలి రూరల్‌)

‘కులం చూడం.. మతం చూడం.. పార్టీ చూడం.. ప్రాం తం చూడం.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల కాలనీలు మం జూరు చేస్తాం’ అన్న ముఖ్యమంత్రి జగన్‌ ప్రక టనలు ఆచరణకు దూరమవుతున్నాయి. పేద లకు పూర్తిస్థాయిలో ఇళ్లు మంజూరు చేయలేదు సరికదా.. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో, హుద్‌హుద్‌ ఇళ్ల కాలనీలు సైతం అర్హు లకు కేటాయించని పరిస్థితి నెలకొంది. దీంతో చాలామంది గూడులేని అభాగ్యులుగా మిగిలి పోతున్నారు. టెక్కలిలోని విశాకోటి ఆదినారా యణ, లక్ష్మీ వృద్ధ దంపతుల దీనగాథ ఇందుకు నిదర్శనం. వివరాల్లోకి వెళితే..
టెక్కలి మేజరు పంచాయతీ రాందాసుపేటకు చెందిన విశాకోటి ఆదినారాయణ, లక్ష్మీ దంపతులు.. తమ కొడుకు, కోడలు భాస్కర్‌, సరోజినితో కలిసి స్థానిక చిన్నబజారులోని చేపలమార్కెట్‌ వద్ద చిన్నగదిలో తల దాచుకుంటున్నారు. ఆదినారాయణ భిక్షాటన చేస్తారు. భార్య, కొడుకు, కోడలు రోడ్లు వెంబడి తిరిగి బాటిళ్లు, ఇతర సామగ్రిని సేకరించి.. వాటిని విక్రయించి జీవనం సాగిస్తు న్నారు. రాందాసుపేటలో ఇంతకుముందు అద్దె ఇంట్లో వీరంతా నివసించేవారు. తితలీ తుఫాన్‌ సమయంలో ఆ ఇల్లు శిఽథిలమై నేలకూలింది. అప్పటి నుంచి వీరికి నీడ కరువైంది. ఎక్కడ తలదాచుకోవాలో తెలియక చివరకు స్థానిక చిన్నబజారు లోని చేపల మార్కెట్‌ వద్ద చిన్నగదిలో నే నలుగురూ నివసిస్తున్నారు. చీరలు, సిమెంట్‌ బస్తాలను పరదాలుగా కప్పి.. చలికి వణుకుతూ.. వానకు తడుస్తూ కాలం వెల్లదీస్తున్నారు. ప్రభుత్వానికి మూడు నాలుగు సార్లు దరఖాస్తు చేసుకున్నా.. ఇప్పటివరకు ఇల్లు మంజూరు చేయ లేదు. అద్దె కూడా చెల్లించే స్తోమత లేక.. చిన్నగదిలోనే సుమారు నాలుగేళ్లుగా జీవనం సాగిస్తున్నారు. ఈ అభాగ్యుల దీనస్థితిని చూసి కొందరు దుస్తులు అందిస్తుండగా, మరికొందరు కొన్ని సంద ర్భాల్లో భోజనం పెడుతున్నారు. నిరుపేదలైన తమకు ప్రభుత్వం ఇల్లు మంజూరుచేసి ఆదుకోవాలని బాధితులు  కోరుతున్నారు.



Updated Date - 2022-07-19T05:16:08+05:30 IST