కరోనా దెబ్బకు హోటల్‌ రంగం డమాల్‌

ABN , First Publish Date - 2020-06-07T07:06:52+05:30 IST

కరోనా మహమ్మారి దెబ్బకు హోటల్‌ రంగం బలైంది. జిల్లాలో హోటల్‌, రెస్టారెంట్‌ నిర్వాహకులతోపాటు కార్మికులు రెండున్నర్ర నెలలుగా ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కరోనా దెబ్బకు హోటల్‌ రంగం డమాల్‌

హిందూపురం, జూన్‌ 6: కరోనా మహమ్మారి దెబ్బకు హోటల్‌ రంగం బలైంది. జిల్లాలో హోటల్‌, రెస్టారెంట్‌ నిర్వాహకులతోపాటు కార్మికులు రెండున్నర్ర నెలలుగా ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  అద్దె, విద్యుత్‌ బిల్లులు, సిబ్బందికి వేతనాలు చెల్లింపు తడిసిమోపెడవుతున్నాయి. చిన్నా చితక మొదలుకుని హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్‌లపై ఆధారపడి జిల్లాలో వేలాది మంది జీవిస్తున్నారు. జనతా కర్ఫ్యూ నుంచి హోటళ్లు పూర్తి బంద్‌ చేశారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ ఆర్డర్‌పై సరఫరాకు అనుమతి ఇచ్చినా ఊపం దుకోలేదు. ఇక హిందూపురం ప్రాం తలో చిన్న హోటల్‌ కూడా నేటికి తెరుచుకోలేదు. ఎన్నో కుటుంబాలకు ఉపాధి కల్పించే హోటల్‌ రంగా న్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరు తున్నారు.

 

నిర్వహణ.. పెనుభారం 

కరోనా లాక్‌డౌన్‌తో హోటళ్లు పూర్తిగా మూతపడడంతో నిర్వహణ పెనుభారంగా మారింది. ప్రధానంగా హోటళ్లలో వంట మాస్టర్లు, సర్వీస్‌ బాయ్స్‌, ఫుడ్‌ ఆర్డర్‌, క్లీనింగ్‌, రిసెప్షనిస్ట్‌, రూమ్‌బాయ్స్‌, హోటల్‌, రెస్టారెంట్లు, క్యాటరింగ్‌లో పనిచేస్తున్నారు. హోటల్‌ సామర్థ్యాన్ని బట్టి 10 నుంచి 50 మంది దాక సిబ్బంది పని చేస్తున్నారు. వీరికి నెలకు జీతం స్థాయిని బట్టి  ఒక్కొక్కరికి రూ.10 వేలు మొదలు కుని 25 వేల వరకు చెల్లిస్తుంటారు. అయితే హోటళ్లు మూతపడడంతో వ్యాపారం పూర్తిగా దెబ్బతింది.


పనిచేసే సిబ్బందికి మాత్రం వేతనాలు ఇవ్వాల్సివస్తోంది. లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో పనులు లేకపోడంతో చాలా మంది సొంత ఊర్లకు వెళ్లిపోయారు. హోటల్‌, రెస్టారెంట్ల కు కరెంటు బిల్లులు, అద్దెలు చెల్లించాల్సివస్తోంది. హోట ళ్లు, రెస్టారెంట్లు స్థాయిని బట్టి నెలకు రూ. 10 వేల నుంచి రూ. లక్షకుపైగా అద్దె చెల్లించేవి ఉన్నాయి. రెండు నెలలు గా మూత పడడంతో అద్దె, విద్యుత్‌, సిబ్బంది వేతనాలు నిర్వాహకులకు భారంగా మారాయి.

Updated Date - 2020-06-07T07:06:52+05:30 IST