హోసూరుకి విమానాశ్రయం?

ABN , First Publish Date - 2022-04-20T14:14:33+05:30 IST

రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు నెలకొల్పేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు శాసనసభలో పరిశ్రమలశాఖ తెలిపింది. కృష్ణగిరి జిల్లా హోసూరు సమీపంలో, చెన్నై నగర

హోసూరుకి విమానాశ్రయం?

చెన్నై: రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు నెలకొల్పేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు శాసనసభలో పరిశ్రమలశాఖ తెలిపింది. కృష్ణగిరి జిల్లా హోసూరు సమీపంలో, చెన్నై నగర సమీపంలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాలను గురించి, సాధ్యాసాధ్యాలను వివరిస్తూ భారత విమానయాన సంస్థ అధికారుల కమిటీ ఓ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. భారత విమానాయాన సంస్థ, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ (టిడ్కో) సంయుక్తంగా విమానయాన సేవల విస్తరణ చర్యలు చేపడుతున్నాయి. కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నగరానికి సమీపంలో ఏర్పాటుచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే అంగీకరించింది. కొత్త విమానాశ్రయాన్ని నెలకొల్పేందుకు అనువైన స్థలాలను ఎంపిక చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం టిడ్కోకు అప్పగించింది. విమానాశ్రయానికి అనువైన నాలుగు స్థలాలను ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, భారత విమానయాన సంస్థకు ఆ సంస్థ నివేదికలను సమర్పించనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వాయువ్యదిశలో ఉన్న ప్రాంతాలను పారిశ్రామికపరంగా అభివృద్ధి చేయడానికి వీలుగా కృష్ణగిరి జిల్లా హోసూరు సమీపంలో కొత్త విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. హోసూరు ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి అనువైన వాతావారణ పరిస్థితులపై టిడ్కో సంస్థ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.

Updated Date - 2022-04-20T14:14:33+05:30 IST