సమస్యల ‘వైద్యం’

ABN , First Publish Date - 2021-07-26T06:08:08+05:30 IST

ఆస్పత్రిలో కార్పోరేట్‌ వైద్యసేవలు అందిస్తున్నట్లు గొప్పలు చెబుతున్నారు. ఆసుపత్రికి వెళ్లితే మాత్రం రోగ నిర్థారణ వైద్యపరీక్షల నుంచి స్కానింగ్‌ వరకు ప్రైవేట్‌ ల్యాబొరేటరీలకు పరుగులు పెట్టాల్సివస్తోంది.

సమస్యల ‘వైద్యం’
సీటీ స్కానింగ్‌ గదికి తాళం


-మూడేళ్లుగా సీటీ స్కానింగ్‌ సేవలు బంద్‌

-రోగులపై ఆర్థిక భారం 

-హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో ఇబ్బందులు


హిందూపురం, జూలై 25: ఆస్పత్రిలో కార్పోరేట్‌ వైద్యసేవలు అందిస్తున్నట్లు గొప్పలు చెబుతున్నారు. ఆసుపత్రికి వెళ్లితే మాత్రం రోగ నిర్థారణ వైద్యపరీక్షల నుంచి స్కానింగ్‌ వరకు ప్రైవేట్‌ ల్యాబొరేటరీలకు పరుగులు పెట్టాల్సివస్తోంది. ఈనేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే రోగులకు ఆర్థిక భారం మోయాల్సివస్తోంది. ఇది జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రి హిందూపురంలో వైద్యం సేవల పొందుతున్న రోగులు పడుతున్న అవస్థలివి. ప్రతి రోజు ఆస్పత్రిలో అన్ని విభాగాల్లో సగటున ఓపీ 1500దాకా ఉండేది. కొవిడ్‌ కారణంగా తగ్గినా మళ్లీ రోగుల ఓపీ పెరుగుతోంది. ఇలాంటి ఆసుపత్రిలో సీటీ, ఆల్ర్టాసౌండ్‌ స్కానింగ్‌ సేవలతోపాటు రోగ నిర్థారణ పరీక్షల కోసం ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లో చేయించుకోవాల్సివస్తోంది. చివరకు జాతీయ స్థాయి అవార్డులు సొంతం చేసుకున్న జిల్లా ఆసుపత్రిలో ప్రైవేట్‌ ల్యాబొరేటిరీల్లో పరీక్షలు వైద్యం మాత్రం ఆస్పత్రిలో అన్న విదంగా తయారైంది. ఆసుపత్రిలో సౌకర్యాల, వైద్యసేవలపై ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో పేద, మధ్యతరగతి వర్గాలు ఆందోళన చెందాల్సివస్తోంది.

-స్కానింగ్‌ అక్కడ.. వైద్యం ఆసుపత్రిలో

హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతి రోజు వందలాది మంది వైద్య సేవల కోసం వస్తున్నారు. ఆసుపత్రిలో ఓపీ తగ్గట్టుగా వైద్యులు, సిబ్బంది లేకపోయినా ఉన్నవారితోనే సేవలు అందిస్తున్నా రు. అయితే ప్రధానంగా ఆస్పత్రిలో సీటీ స్కానింగ్‌ యంత్రాలు మరమ్మత్తులకు రాగా మూడేళ్లుగా సేవలు పూర్తిగా బంద్‌ చేశారు. ఆసుప్రతికి వచ్చే సీటీ స్కానింగ్‌ అవసరమైన వారు ప్రైవేట్‌ ల్యాబొరేటరీల్లో రూ.2500 నుంచి 3000లకుపైగా చెల్లించాల్సివస్తోంది. అదే విదంగా రేడియాలజీ విభాగంలో ఆల్ర్టాసౌండ్‌ స్కానింగ్‌ యంత్రాలు ఉన్నా రేడియాలజీట్‌ ఏడాదిగా సెలవుపై వెళ్లారు. స్కానింగ్‌ బంద్‌తో ప్రైవేట్‌కు వెళ్లి రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు చెల్లించాల్సి వస్తోంది. గతంలో ఆసుపత్రిలో మోడాల్‌ ల్యాబ్‌తో 50కిపైగా రోగనిర్థారణ పరీక్షలు జరిగేవి. అయితే మోడాల్‌ సేవలు నిలిపివేయడంతో  జ నరల్‌ ల్యాబ్‌ ఉన్నా కేవలం కొన్నింటికి మాత్రం చేస్తున్నా రు. మిగిలిన పరీక్షల కోసం ప్రైవేట్‌కు రెఫర్‌ చేయాల్సిన పరిస్థితి. ఇక ఎక్స్‌రే యూనిట్‌లో కూడా తరుచూ మరమత్తులతో ప్రైవేట్‌కు పరుగులు పెట్టాల్సివస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం వస్తే పరీక్షలు స్కానింగ్‌ ప్రైవేట్‌లో సేవలన్న విధంగా మార్చేశారు. వైద్య సేవల కోసం వచ్చి ప్రైవేట్‌కు వెళ్లాల్సి రావడంతో రోగుల జేబులకు చీల్లు పడుతోంది. ఆసుపత్రిలో సీటీ, రేడియాలజీలో స్కానింగ్‌ సేవలు బంద్‌తో ప్రైవేట్‌ ల్యాబొరేటరీలకు రెఫర్‌ చేస్తున్నట్లు విమర్శలున్నాయి. .


ప్రతిపాదనలు పంపాం 

ప్రభుత్వ అసుపత్రిలో అన్ని విభాగాల్లో నాణ్యమై వై ద్యసేవలు అందిస్తున్నాం. జనరల్‌ ల్యాబ్‌లో రోగనిర్థారణ పరీక్షలతోపాటు ఇతర పరీక్షలు నిర్వహిస్తున్నాం. రెండేళ్ల కిందటే సీటీ స్కానింగ్‌ మరమత్తులకు వచ్చింది. కొత్తగా సీటీ స్కానింగ్‌ యానిట్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేశాం.

                - డాక్టర్‌ జోసెఫ్‌, సూపరిటెండెంట్‌.








Updated Date - 2021-07-26T06:08:08+05:30 IST