వైద్య ఖర్చులు తట్టుకోలేక.. సొంతంగా ఆస్పత్రి ఏర్పాటు చేసిన వ్యాపారి!

ABN , First Publish Date - 2020-07-30T01:04:57+05:30 IST

మామూలు సమయాల్లోనే కార్పొరేట్ ఆస్పత్రులు అంటే ఆమడ దూరం పరిగేత్తే సామాన్యులు.. కరోనా సమయంలో మరింతగా బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల కరోనా బారిన పడ్డ ఓ వ్యాపారికి సరిగ్గా ఇదే అనుభవం కలిగింది.

వైద్య ఖర్చులు తట్టుకోలేక.. సొంతంగా ఆస్పత్రి ఏర్పాటు చేసిన వ్యాపారి!

సూరత్: మామూలు సమయాల్లోనే కార్పొరేట్ ఆస్పత్రులు అంటే ఆమడ దూరం పరిగేత్తే సామాన్యులు.. కరోనా కాలంలో మరింతగా బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల కరోనా బారిన పడ్డ ఓ బడా వ్యాపారికీ సరిగ్గా ఇదే అనుభవం కలిగింది. అంతోఇంతో డబ్బును కళ్లచూసే ఆయన కూడా ఆస్పత్రి ఖర్చు చూసి జడుసుకున్నారు. తన పరిస్థితే ఇలా ఉంటే ఇక పేదల పరిస్థితేంటనే ఆందోళన ఆయనలో కలిగింది. దీంతో వెంటనే ఆయన తన సొంత కార్యాలయాన్నే కరోనా ఆస్పత్రిగా మార్చేశారు. 


ఇంతటి ఉదారత కనబరిచిన ఆ వ్యాపారి పేరు ఖాదర్ షేక్. గుజరాత్‌లోని సూరత్ వాసి. ఇటీవలే కరోనా బారిన పడ్డారు. స్థానిక క్లీనిక్‌లో చికత్స తీసుకుని కరోనా నుంచి బయటపడ్డాడు. అయితే డిశ్చార్చ్ సమయంలో ఆస్పత్రి వారి బిల్లు ఇచ్చిన షాక్ నుంచి మాత్రం అంత తొందరగా బయటపడలేకపోయాడు. పేదల పరిస్థితి తలుచుకంటే ఆయనకు మరింత కడుపుతరుక్కుపోయింది. దీంతో ఆయన వెంటనే తన 30 వేల చదరపు అడుగుల కార్యాలయ్యాన్ని 85 పడకలున్న ఆసత్రిగా మార్చేశారు. బెడ్లు, విద్యుత్ వంటి అవసరాలను తనే సమకూర్చారు. ఉచితంగా చికిత్స అందిస్తానని ప్రకటించారు. అయితే హాస్పటల్‌కు కావాల్సిన వైద్యులను, ఇతర సిబ్బందిని ప్రభుత్వం సమకూర్చింది. చూస్తుండగా ఆయన ఆస్పత్రిలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆయన మనసు కాస్తంత కుదుట పడింది. ఆస్పత్రి బిల్లు ఇచ్చిన షాక్ నుంచి బయటపడింది. జాతి, కుల, మత వివక్షకు తావులేకుండా ఎవరికైనా ఉచితంగా సేవలిందిస్తామని చెబుతున్నారు ఖాదర్.   

Updated Date - 2020-07-30T01:04:57+05:30 IST