హోమియోపతి పితామహుడు హానిమన్‌

ABN , First Publish Date - 2021-04-11T04:40:03+05:30 IST

సినీలియా, సీమిలిబస్‌, క్యూ రెండర్‌ సూత్రం ఆధారంగా హోమియోపతి వ్యవస్థను కనుగొన్న హోమియోపతి పితామహుడుగా డాక్టర్‌ క్రిస్టియన్‌ ఫెడరిక్‌ శ్యామ్యుల్‌ హానిమన్‌ చరిత్రకెక్కారు.

హోమియోపతి పితామహుడు హానిమన్‌

కమలాపురం (రూరల్‌), ఏప్రిల్‌ 10 : సినీలియా, సీమిలిబస్‌, క్యూ రెండర్‌ సూత్రం ఆధారంగా హోమియోపతి వ్యవస్థను కనుగొన్న హోమియోపతి పితామహుడుగా డాక్టర్‌ క్రిస్టియన్‌ ఫెడరిక్‌ శ్యామ్యుల్‌ హానిమన్‌ చరిత్రకెక్కారు. 1755 ఏప్రిల్‌ 10న ఆయన జన్మించారు. ఆయన పుట్టినరోజునే ప్రపంచ హోమియోపతి దినంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని స్థానిక ప్రభుత్వ హోమియోపతి వైద్యుడు షాకీర్‌హుసేన్‌ అ న్నారు. శనివారం స్థానిక హోమియోపతి హాస్పిటల్‌లో హనీమన్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనీమన్‌ ఎన్నో దీర్ఘకాలి క వ్యాధులను నయం చేశారని కొనియాడారు. హోమియోపతి వైద్యం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తున్నామ ని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంపౌండర్‌ బాలరాజు, రమణ పాల్గొన్నారు.

Updated Date - 2021-04-11T04:40:03+05:30 IST