రొమ్ము క్యాన్సర్‌ను నయంచేసే తేనెటీగల విషం

ABN , First Publish Date - 2022-02-24T14:44:18+05:30 IST

తేనెటీగల విషం క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుందని..

రొమ్ము క్యాన్సర్‌ను నయంచేసే తేనెటీగల విషం

తేనెటీగల విషం క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుందని ఒక కొత్త అధ్యయనంలో వెల్లడయ్యింది. వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని హ్యారీ పెర్కిన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లోని శాస్త్రవేత్తలు 300 కంటే ఎక్కువ తేనెటీగలు, బంబుల్బీల విషాన్ని పరీక్షించారు. తేనె టీగలలోని ట్రిపుల్ నెగటివ్, హ్యూమన్ ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్ 2 (HER2) కలిగిన ఈ విషంలోని సమ్మేళనం ఇతర కణాలకు ఏమాత్రం హాని కలిగించకుండా, ఒక గంటలోపు రొమ్ము క్యాన్సర్ కణాలను నాశనం చేయగలదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 


కీమోథెరపీ మందులతో కలిపి దీనిని ఉపయోగించినప్పుడు చక్కని ఫలితాలను ఇస్తున్నదని తేలింది. ఈ అధ్యయనానికి సంబంధించిన పరీక్షలు ల్యాబ్ సెట్టింగ్‌లో మాత్రమే జరిగినప్పటికీ, రొమ్ము క్యాన్సర్‌కు చికిత్సగా ఈ సమ్మేళనాన్ని కృత్రిమంగా పునరుత్పత్తి చేయవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. మోఫిట్ క్యాన్సర్ సెంటర్‌లోని రొమ్ము క్యాన్సర్ పరిశోధకురాలు డాక్టర్ మారిలెనా టౌరో మాట్లాడుతూ.. ఈ నూతన చికిత్సా విధానం ఆచరణీయమైన చికిత్సగా మారడానికి ముందు మరిన్ని పరిశోధనలు చేయవలసి ఉంటుందన్నారు. అయితే ఇక్కడ శుభవార్త ఏమిటంటే.. వ్యాధి పెరుగుదల, వ్యాప్తికి కారణమయ్యే రొమ్ము క్యాన్సర్ కణాలలో మెలిటిన్ సిగ్నలింగ్ మార్గాలకు అంతరాయం కలిగిస్తుందని ఈ అధ్యయనం వెల్లడించిందని ఆమె చెప్పారు. ల్యాబ్ లేదా జంతు నమూనాలలో క్యాన్సర్ కణాలను చంపడంలో ఈ సమ్మేళనాల ప్రయోగం విజయవంతమయ్యిందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. అయితే ఆ నూతన ఆవిష్కరణలు బాధితుల వరకూ చేరేందుకు చాలా సంవత్సరాలు పడుతుందని మారిలెనా టౌరో తెలిపారు. 




Updated Date - 2022-02-24T14:44:18+05:30 IST