Abn logo
Mar 15 2021 @ 07:21AM

భారత ఆర్మీజవానుపై పాక్ మహిళ హనీట్రాప్

 పాక్‌కు రహస్యసమాచారం లీక్...ఆర్మీ జవాన్ అరెస్ట్

జైపూర్ (రాజస్థాన్): మన ఆర్మీకి చెందిన రహస్యాలను పాకిస్థాన్ దేశానికి లీక్ చేసిన ఆర్మీ జవాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలోని సికార్ జిల్లాకు చెందిన లక్ష్మణ్ ఘడ్ తహసీల్ లోని సికార్ కు చెందిన ఆకాష్ మెహ్రియా 2018 సెప్టెంబరులో భారత సైన్యంలో చేరాడు. 2019లో శిక్షణ పూర్తి చేశాక మెహ్రియాను సిక్కింలో జవానుగా నియమించారు. పాకిస్థాన్ మహిళా ఏజెంట్లతో హనీట్రాప్ లో చిక్కుకున్న మెహ్రియా వారికి భారత రహస్య సమాచారాన్ని అందించాడని పోలీసులు చెప్పారు. పాక్ ఏజెంట్లు అయిన అమ్మాయిలతో జరిపిన ఛాటింగులలో రహస్య సమాచారం లీక్ చేశారని తేలిందని రాజస్థాన్ ఇంటెలిజెన్స్ పోలీసులు చెప్పారు.


పాక్ మహిళా ఏజెంట్లు మెహ్రియాతో ఫేస్‌బుక్ ద్వారా స్నేహం చేశారని తేలింది. ఆర్మీజవాన్ మెహ్రియా సెలవుల్లో సిక్కిం నుంచి జైపూర్ నగరానికి వచ్చినపుడు నిఘా సంస్థలు అతన్ని ప్రశ్నించాయి. ఫేస్ బుక్ స్నేహ అభ్యర్థనలను స్వీకరించిన మెహ్రీయా ఫోన్ ద్వారా పాక్ మహిళా ఏజెంట్లకు రహస్య సమాచారం అందించాడని వెల్లడైంది. దీంతో మెహ్రియాను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

TAGS: ARMY

ఇవి కూడా చదవండిImage Caption