Advertisement
Advertisement
Abn logo
Advertisement

వెచ్చదనం కోసం...

చలికాలంలో తలెత్తే జలుబు, ఫ్లూ జ్వరాలకు ఔషధంగా తేనె బాగా పనిచేస్తుంది.


అల్లం, తులసి టీ శరీరానికి స్వాంతననిస్తుంది.


చలికాలంలో నెయ్యి శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. పరిమిత పరిమాణంలో నెయ్యి వాడడం వల్ల శరీరంలోని చెడు ఫ్యాట్స్‌ తగ్గుతాయి.


డ్రైఫ్రూట్స్‌  ముఖ్యంగా ఖర్జూరాలు, ఆప్రికాట్స్‌ వంటివి తింటే ఒళ్లు వెచ్చగా ఉంటుంది.  


ఈ సీజన్‌లో బెల్లం తినడం వల్ల జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది.   


దాల్చినచెక్క వాడకం కూడా ఈ సీజన్‌లో మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంతోపాటు శరీరంలో వేడి పెరిగేలా చేస్తుంది.


గ్లాసుడు గోరువెచ్చటి  పాలలో కొద్దిగా కొద్దిగా కుంకుమపువ్వు వేసుకుని తాగితే చలిగా అనిపించదు.


ఈ సీజన్‌లో తలెత్తే శ్వాససంబంధమైన సమస్యలకు నువ్వు గింజలు బాగా పనిచేస్తాయి. అందుకే   కూరల్లో, రకరకాల వంటకాల్లో నువ్వులను ఉపయోగిస్తే మంచిది.


వేడి వేడి సూప్స్‌ శరీరానికి ఇన్‌స్టంట్‌ వెచ్చదనాన్ని పంచుతాయి.’

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...