Abn logo
Jun 7 2020 @ 01:38AM

వృద్ధురాలిపై హోంగార్డు అత్యాచారయత్నం!

కనగానపల్లి, జూన్‌6: వృద్ధురాలిపై ఓ హోంగార్డు అత్యాచారానికి యత్నించిన విషయం మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. తల్లిమడుగుల గ్రామానికి చెందిన ఓ యువకుడు కళ్యాణదుర్గంలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఇటీవలే గ్రామానికి వచ్చాడు. గ్రామంలోని ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలిపై అత్యాచారానికి యత్నించాడు. వృద్ధురాలు కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. విషయం పోలీసులకు తెలియకుండా అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు పంచాయితీ చేశాడు. వృద్ధురాలిపై అత్యాచారానికి యత్నించిన హోంగార్డును పిలిపించి, క్షమాపణలు చెప్పించినట్లు తెలిసింది. ఈ విషయంపై ఎస్‌ఐ సత్యనారాయణను వివరణ కోరగా తమకు ఫిర్యాదు అందలేదు, దీనిపై విచారిస్తామన్నారు.

Advertisement
Advertisement
Advertisement