అవార్డు అందుకున్న హెచ్‌ఎం స్వర్ణశ్రీ

ABN , First Publish Date - 2022-07-02T05:03:27+05:30 IST

ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందజేస్తున్న స్వచ్ఛ విద్యాలయ అవార్డుకు మండలంలోని పేరంగుడిపల్లి పాఠశాల ఎంపికైంది. ఈ సందర్భంగా ఒంగోలులోని స్పందన సమావేశ హాలులో శుక్రవారం కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ నుంచి ఆ పాఠశాల హెచ్‌ఎం స్వర్ణశ్రీ అవార్డును అందుకున్నారు. జిల్లాలోని 4,310 పాఠశాలలు అవార్డులకు దరఖాస్తు చేసుకోగా, అందులో 8 అత్యుత్తమ పాఠశాలలు స్వచ్ఛ విద్యాలయం పురస్కార్‌ అవార్డుకు ఎంపికైనాయి.

అవార్డు అందుకున్న హెచ్‌ఎం స్వర్ణశ్రీ
కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ చేతులమీదుగా అవార్డు అందుకుంటున్న హెచ్‌ఎం స్వర్ణశ్రీ

కనిగిరి, జూలై 1: ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందజేస్తున్న స్వచ్ఛ విద్యాలయ అవార్డుకు మండలంలోని పేరంగుడిపల్లి పాఠశాల ఎంపికైంది. ఈ సందర్భంగా ఒంగోలులోని స్పందన సమావేశ హాలులో   శుక్రవారం కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ నుంచి ఆ పాఠశాల హెచ్‌ఎం   స్వర్ణశ్రీ అవార్డును అందుకున్నారు. జిల్లాలోని 4,310 పాఠశాలలు  అవార్డులకు దరఖాస్తు చేసుకోగా, అందులో 8 అత్యుత్తమ పాఠశాలలు స్వచ్ఛ విద్యాలయం పురస్కార్‌ అవార్డుకు ఎంపికైనాయి. వాటిలో కనిగిరి మండలం పేరంగుడిపల్లి పాఠశాల  తాగునీరు, మరుగుదొడ్లు, పచ్చదనం, పరిశుభ్రత, కొవిడ్‌ జాగ్రత్తలు, విద్యార్థుల ప్రవర్తన వంటి వాటిపై చేసిన సర్వేలో ఎంపికైంది. పేరంగుడిపల్లి పాఠశాల ఎంపికవటం పట్ల గ్రామస్థులు, ఉపాధ్యాయులు, జడ్పీటీసీ కస్తూరిరెడ్డి, ఎంపీపీ దంతులూరి ప్రకాశం హెచ్‌ఎం స్వర్ణశ్రీని అభినందించారు.

  పెదవరిమడుగు పాఠశాల

పీసీపలి : స్వచ్ఛ విద్యాలయంగా మండలంలోని పెదవరిమడుగు ప్రభుత్వ పాఠశాల ఎంపికైందని ప్రధానోపాధ్యాయురాలు ఎలిజిబెత్‌రాణి తెలిపారు.  శుక్రవారం ఒంగోలు ప్రకాశం భవనం స్పందన హాలులో జరిగిన కార్యక్రమంలో పెదవరిమడుగు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు స్వర్ణ రమణయ్య కలెక్టర్‌ దినే్‌షకుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, డీఈవో విజయభాస్కర్‌ చేతులమీదుగా పురస్కారాన్ని అందుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎంఈవో ప్రసాదరావు, ప్రధానోపాధ్యాయురాలు ఎలిజిబెత్‌రాణి , ఉపాధ్యాయులు మాధవరావు తదితరులు ఉన్నారు.  అవార్డు అందుకున్న ఉపాధ్యాయులను మండలంలోని ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు అభినందించారు.

 

Updated Date - 2022-07-02T05:03:27+05:30 IST