జిల్లాలో హెచ్‌ఐవీ కేసులు తగ్గుముఖం

ABN , First Publish Date - 2020-12-02T04:19:12+05:30 IST

జిల్లాలో హెచ్‌ఐవీ కేసులు తగ్గుముఖం

జిల్లాలో హెచ్‌ఐవీ కేసులు తగ్గుముఖం
కార్యక్రమంలో మాట్లాడుతున్నసుధాకర్‌ షిండే

  • జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుధాకర్‌ షిండే
  •  ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా  ర్యాలీలు
  • పలు చోట్ల  అవగాహన సదస్సులు

వికారాబాద్‌ : జిల్లాలో హెచ్‌ఐవీ పాజిటివ్‌ కేసులు తగ్గుముఖంపట్టాయని, ఈ ఏడాది 170 మంది పురుషులు, 147 మంది మహిళలకు మొత్తం 317 హెచ్‌ఐవీ కొత్త కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి సుఽధాకర్‌ షిండే తెలిపారు. మంగళవారం ప్రపంచ ఎయిడ్స్‌ డే సందర్భంగా ఏరియా ఆసుపత్రిలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.  గతంలోకన్నా ఈ సంవత్సరం హెచ్‌ఐవీ పాజిటివ్‌ సంఖ్య గణనీయంగా తగ్గిందని,  ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా  కేసులు తగ్గాయన్నారు. మరణాల సంఖ్య కూడా తగ్గిందని, బాధి తులకు కరోనా సులువుగా సోకే అవకాశం ఉన్నందున, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రొగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ లలిత, డాక్టర్‌ అరవింద్‌, వైద్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.


కులకచర్లలో ర్యాలీ..

కులకచర్ల:  ప్రపంచ ఎయిడ్స్‌డే సందర్భంగా మంగళవారం కులకచర్లలో వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. హెచ్‌ఐవీ నివారణ గురించి వైద్యాఽధికారి మురళీకృష్ణ వివరించారు. కార్యక్రమంలో జిల్లా మానిటరింగ్‌ అధికారి చంద్రప్రకాశ్‌, సీహెచ్‌ఎన్‌ రత్నలత, సూపర్‌వైజర్లు విజయలక్ష్మి, అనిత, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, 108  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


అప్రమత్తంగా ఉండాలి

బొంరాస్‌పేట్‌:  హెచ్‌ఐవీ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహనకలిగి ఉండాలని మండల వైద్యాధికారి రవీంద్రయాదవ్‌ పిలుపు నిచ్చారు. మంగళవారం ప్రపంచ ఎయిడ్స్‌ దినం సందర్బంగా మండల కేంద్రంలో వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యుడు రవీంద్రయాదవ్‌, ఆశా కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-02T04:19:12+05:30 IST