కుర్రాడిపై హెచ్‌ఐవీ పాజిటివ్ పిన్ని ఘాతుకం.. అతనికి పరీక్ష చేయగా..

ABN , First Publish Date - 2022-04-13T09:05:43+05:30 IST

పండుగకు చుట్టాలంతా ఊరొచ్చారు. అలా వచ్చిన పిన్ని ఒక కుర్రాడిపై కన్నేసింది. అతన్ని బలవంతంగా లోబరుచుకొని శారీరక సంబంధం పెట్టుకుంది. అతను నిరాకరిస్తే అందరికీ చెప్తానని, కుర్రాడే బలవంతం చేశాడని కేసు పెడతానని బెదిరించింది. దాంతో ఆ కుర్రాడు భయపడి నోరు మెదపలేదు. అదీగాక సదరు మహిళకు హెచ్‌ఐవీ పాజిటివ్ కూడా..

కుర్రాడిపై హెచ్‌ఐవీ పాజిటివ్ పిన్ని ఘాతుకం.. అతనికి పరీక్ష చేయగా..

పండుగకు చుట్టాలంతా ఊరొచ్చారు. అలా వచ్చిన పిన్ని ఒక కుర్రాడిపై కన్నేసింది. అతన్ని బలవంతంగా లోబరుచుకొని శారీరక సంబంధం పెట్టుకుంది. అతను నిరాకరిస్తే అందరికీ చెప్తానని, కుర్రాడే బలవంతం చేశాడని కేసు పెడతానని బెదిరించింది. దాంతో ఆ కుర్రాడు భయపడి నోరు మెదపలేదు. అదీగాక సదరు మహిళకు హెచ్‌ఐవీ పాజిటివ్ కూడా. ఒకసారి కుర్రాడిని ఆమె బ్లాక్ మెయిల్ చేస్తుండగా.. ఆ సంభాషణ బాధితుడి తల్లి చెవిన పడింది. ఆమె వెళ్లిపోగానే.. కుమారుడిని పిలిచి విషయం ఏంటని నిలదీసింది. దీంతో ఆ కుర్రాడు తల్లికి అంతా చెప్పేశాడు. ఆ తల్లి కోపంతో ఊగిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది.


విషయం తెలుసుకున్న పోలీసులు.. సదరు పిన్నిపై పోక్సో, సెక్షన్ 270 కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో వెలుగు చూసింది. సదరు మహిళ భర్త కూడా హెచ్‌ఐవీ సోకడం వల్లనే మరణించినట్లు తెలిసి.. ఆ కుటుంబం కుర్రాడి భవిష్యత్తు గురించి ఆందోళన చెందింది. అయితే కుర్రాడికి చేసిన పరీక్షల్లో నెగిటివ్ ఫలితం రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2022-04-13T09:05:43+05:30 IST