జనవరి 15న జరుపుకునే ఇండియన్ ఆర్మీ డే ప్రత్యేకతలు మీకు తెలుసా?.. అసలు ఆ రోజే ఎందుకు జరుపుకుంటారంటే..

ABN , First Publish Date - 2022-01-16T07:58:55+05:30 IST

ప్రతి సంవత్సరం జనవరి 15న భారత సైన్యం.. ఇండియన్ ఆర్మీ డే(భారత సైనిక దినోత్సవం) వేడుకలు నిర్వహిస్తుంది. ఆ రోజు దేశ సరిహద్దులను కాపాడి వీర మరణం పొందిన అమర సైనికుల గౌరవార్థంగా ఈ వేడుకలను ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో ఉన్న అమర జ్యతి వద్ద నిర్వహిస్తారు...

జనవరి 15న జరుపుకునే ఇండియన్ ఆర్మీ డే ప్రత్యేకతలు మీకు తెలుసా?.. అసలు ఆ రోజే ఎందుకు జరుపుకుంటారంటే..

ప్రతి సంవత్సరం జనవరి 15న భారత సైన్యం.. ఇండియన్ ఆర్మీ డే(భారత సైనిక దినోత్సవం) వేడుకలు నిర్వహిస్తుంది. ఆ రోజు దేశ సరిహద్దులను కాపాడి వీర మరణం పొందిన అమర సైనికుల గౌరవార్థంగా ఈ వేడుకలను ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో ఉన్న అమర జ్యతి వద్ద నిర్వహిస్తారు. అమర జవాన్లకు గౌరవ వందనం చేసిన తరువాత భారత సైన్యం సాధించిన ఘన విజయాలను, సైన్య టెక్నాలిజీని పరేడ్ ప్రదర్శన చేస్తారు. అనంతరం భారత సైన్యంలో వీర ప్రదర్శన చేసిన సైనికులకు వివిధ సేన మెడల్స్‌తో సత్కరిస్తారు. జనవరి 15 2022న కూడా 74 వ ఇండియన్ ఆర్మీ డే సందర్భంగా ఆర్మీ చీఫ్ యం యం నరవణే, ఎయిర్ చీఫ్ మార్షల్ వీ ఆర్ చైధరి అవర జవాన్లకు గౌరవ వందనం చేశారు. 


ఇండియన్ ఆర్మీ డే అసలు ఆరోజే ఎందుకు నిర్వహిస్తారు, దాని చరిత్ర విశేషాలేంటో తెలుసుకుందాం. 1947లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1949 వరకు కూడా భారత సైన్యానికి ఒక బ్రిటీష్ అధికారి జెనెరల్ ఫ్రాన్సిస్ బుచర్ నాయకత్వం వహించారు. 1949 జనవరి 15న ఆయన పదవి విరమణ చేసి ఒక భారతీయుడైన లెఫ్టినెంట్ జెనెరల్ యం యం కరియప్పకు భారత సైన్య పగ్గాలను అప్పగించారు. దీంతో భారత సైన్యానికి మొట్టమొదటి భారతీయ ఆర్మీ జెనెరల్‌గా యం యం కరియప్ప చరిత్రకెక్కారు. ఆ రోజు భారత సైన్యం పూర్తిగా బ్రిటీష్ వారి నుంచి విముక్తి పొందింది గనుక ఆ రోజునే భారత సైన్యం ఇండియన్ ఆర్మీ డే వేడుకలు జరుపుకుంటుంది. 




జెనెరల్ కరియప్ప 1947లో భారత్, పాకిస్తాన్ యుద్ధానికి నేతృత్వం చేశారు. ఆయనకు రిటైర్మెంట్ తరువాత 1986లో ఫీల్డ్ మార్షల్ ర్యాంక్‌తో భారత సైన్యం గౌరవించింది. దీంతో పాటు రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటీషు ఆర్మీ తరపున పోరాడి బర్మాలో జపానీయులపై విజయం సాధించినందుకు జెనెరల్ కరియప్పకు ఆర్డర్ ఆఫ్‌ ది బ్రిటీష్ ఎంపైర్ అవార్డు కూడా లభించింది.


భారత సైన్యం 1776లో మొట్టమొదటి సారిగా బ్రిటీషు వారి పాలనలో ఏర్పాటైంది. అప్పుడు భారత సైన్యం బ్రిటీషు సైన్యంలో ఒక చిన్న భాగం మాత్రమే. ఆ తరువాత 1895లో భారత సైన్యం 'బ్రిటీష్ భారతీయ సేన'(బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ)గా రూపాంతరం చెందింది. చివరకు 1949లో కరియప్ప నాయకత్వంలో ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్‌గా అవతరించింది.

Updated Date - 2022-01-16T07:58:55+05:30 IST