చారిత్రాత్మకం... కస్తూర్బా గాంధీ ఆశ్రమం

ABN , First Publish Date - 2020-10-02T09:35:30+05:30 IST

సీతానగరంలో 1924లో బ్రహ్మజ్యోస్యుల సుబ్రహ్మణ్యం గోదావరి గట్టు సమీపంలో గౌతమి సత్యాగ్రహాశ్రమం ఏర్పాటుచేశారు.

చారిత్రాత్మకం... కస్తూర్బా గాంధీ ఆశ్రమం




సీతానగరం, అక్ట్టోబరు 1: సీతానగరంలో 1924లో బ్రహ్మజ్యోస్యుల సుబ్రహ్మణ్యం గోదావరి గట్టు సమీపంలో గౌతమి సత్యాగ్రహాశ్రమం ఏర్పాటుచేశారు. దీనిని మహాత్మాగాంధీ రెండుసార్లు సందర్శించారు. 1929 మే 8, 9 తేదీల్లో తొలిసారిగా వచ్చి ఆశ్రమ కార్యక్రమాలను చూసి సుబ్రహ్మణ్యాన్ని అభినందించారు. హరిజనోద్ధరణ యాత్రలో భాగంగా 1933 డిసెంబరులో రెండోసారి వచ్చి ఆశ్రమవాసులను ఉత్తేజపర్చారు. సతీసమేతంగా ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారు. కస్తూర్బా మరణానంతరం కస్తూర్బాగాంధీ ఆశ్రమంగా పేరు మార్చారు. సమాజంలో విధివంచితులైన మహిళలను చేరదీసి వారికి వివిధ రంగాల్లో తర్ఫీదునిచ్చి ఆత్మస్థైర్యంతో జీవించేలా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆశ్రమానికి నిధులు నిలిచిపోవడంతో కార్యక్రమాలు స్తంభించిపోయాయి. ఇక్కడ వున్న మహిళలకు భోజనం పెట్టే పరిస్థితి కూడా లేకపోవడంతో ఆశ్రమ ప్రతినిధి జి.సుశీల దాతలను ఆశ్రయిస్తున్నారు.

Updated Date - 2020-10-02T09:35:30+05:30 IST