Chennai: ఆలయాల నగలు దోచుకుంటున్నారు!

ABN , First Publish Date - 2021-10-27T16:13:40+05:30 IST

భక్తులు ఆలయాలకు కానుకలుగా సమర్పించే నగలను కరిగించే సాకుతో ప్రస్తుత పాలకులు దోచుకుంటున్నారని హిందూ మున్నని ఆరోపించింది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నగరంలోని 18 ఆలయాల సమీపం

Chennai: ఆలయాల నగలు దోచుకుంటున్నారు!

                           - హిందూ మున్నని ధ్వజం


ప్యారీస్‌(Chennai): భక్తులు ఆలయాలకు కానుకలుగా సమర్పించే నగలను కరిగించే సాకుతో ప్రస్తుత పాలకులు దోచుకుంటున్నారని హిందూ మున్నని ఆరోపించింది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నగరంలోని 18 ఆలయాల సమీపంలో మంగళవారం ధర్నాలు చేపట్టింది. స్థానిక మింట్‌ జంక్షన్‌ గడియారం స్తంభం సమీపంలో హార్బర్‌ నియోజకవర్గ హిందూ మున్నని, బీజేపీ సంయుక్త ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఉత్తర చెన్నై హిందూ మున్నని జిల్లా కార్యదర్శి వసంత్‌ నేతృత్వంలో నిర్వహించిన ఈ ధర్నాను బీజేపీ ప్రముఖుడు, న్యాయవాది వి.గిరినాథ్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘కోయిల్‌ నగైగల్‌ కొల్ల పోగుది’ అనే అంశంతో ముద్రించిన ప్రచార పుస్తకాన్ని ఆవిష్కరించి ఆ ప్రాంతంలో పంపిణీ చేశారు. కుటుంబంలో నెలకొన్న సమస్యల పరిష్కారం అయితే తమ మాంగల్యాన్ని మహిళలు పలు ఆలయాల్లో కానుకలుగా సమర్పిస్తున్నారని, అయితే ఈ మాంగల్యం విలువ తెలియక నేటి పాలకులు కరిగించి మహిళల మనోభావాలు కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ ధర్నాలో రవి, సేతు, ఏబీ కుమార్‌, వేలు, భాస్కర్‌, జయకుమార్‌ సహా యాభై మందికి పైగా పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-10-27T16:13:40+05:30 IST