ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటుకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం

ABN , First Publish Date - 2020-06-05T00:24:00+05:30 IST

హిమాచల్ ప్రదేశ్‌లో పంచాయతీలు, అర్బన్ లోకల్ బాడీస్ ఆర్థిక పరిస్థితిని

ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటుకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం

న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్‌లో పంచాయతీలు, అర్బన్ లోకల్ బాడీస్ ఆర్థిక పరిస్థితిని సమీక్షించేందుకు 6వ ఫైనాన్స్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 


రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 6వ ఫైనాన్స్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పన్నులు, సుంకాలు, టోల్, ఫీజులు వంటివాటిని నిర్ణయించి, పంచాయతీల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచేందుకు తగిన సిఫారసులను గవర్నర్‌కు ఈ కమిషన్ సమర్పిస్తుంది. 


పంచాయతీలు, అర్బన్ లోకల్ బాడీస్ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచేందుకు తీసుకోవడానికి సంబంధించిన ఇతర అంశాలను కూడా పరిశీలించేందుకు ఈ కమిషన్‌కు అధికారం ఉంది.


Updated Date - 2020-06-05T00:24:00+05:30 IST