విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జ్.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం

ABN , First Publish Date - 2021-11-08T19:26:17+05:30 IST

అనంతపురం: ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాలలో ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది.

విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జ్.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం

అనంతపురం: ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాలలో ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. విద్యార్థులపై పోలీసులు లాటీ చార్జ్ చేశారు. ఈ ఘటనలో ఓ విద్యార్థిని తలకు తీవ్ర గాయమైంది. మరికొందరు గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. కాలేజీలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. అంతకుముందు విద్యార్థులు ఎయిడెడ్ విద్యా సంస్థలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిపై విరుచుకుపడ్డారు.


పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను పోలీసులు కొట్టడం చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. విద్యార్థుల  భవిష్యత్ గురించి ఆలోచించకుండా... రాజకీయ నేతలు వారి బాగోగుల గురించి ఆలోచిస్తున్నారని విమర్శించారు. ఒక్కో ప్రభుత్వం ఒక్కో తరహా విధానాలు తీసుకువచ్చి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయకూడదన్నారు. అసలు ఎయిడెడ్ కళాశాలలు ఎందుకు రద్దు చేస్తున్నారు?... ఏం చేయాలనుకుంటున్నారో పిల్లలకు చెప్పాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2021-11-08T19:26:17+05:30 IST