నియంత్రిత సాగుతోనే అధిక లాభాలు

ABN , First Publish Date - 2020-06-06T09:52:57+05:30 IST

నియంత్రిత సాగు విధానంతో రైతులు అధిక లాభాలు పొందేందుకు రాష్ట్ర ప్ర భుత్వం కృషి

నియంత్రిత సాగుతోనే అధిక లాభాలు

నకిరేకల్‌/చిట్యాల రూరల్‌/శాలిగౌరారం / మర్రిగూడ / వేములపల్లి / అడవిదేవులపల్లి(దామరచర్ల) / తిరుమలగిరి(సాగర్‌), జూన్‌ 5 :  నియంత్రిత సాగు విధానంతో  రైతులు అధిక లాభాలు పొందేందుకు రాష్ట్ర ప్ర భుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్‌లోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం వ్యవసాయ అధికారులతో నిర్వహించిన  నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా 54మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల ను పంపిణీ చేశారు. మర్రిగూడలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో జడ్పీ చె ౖర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి సీఎం కేసీఆర్‌ నియంత్రిత వ్యవసాయాన్ని అమలు చేస్తున్నారన్నారు.


చిట్యాల మండలం బొంగోనిచెర్వు, ఏపూర్‌, చిట్యాల పరిధిలోని శివనేనిగూడెంలో నియంత్రిత వ్యవసాయంపై సర్పంచ్‌లు సామిడి మోహన్‌రెడ్డి, పాలెం మాధవి అవగాహన కల్పించారు. శాలిగౌరారం మండలం  ఉప్పలంచ, తక్కళ్లపహడ్‌, పెర్కకొండారం గ్రామాల్లో నియంత్రిత పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రభుత్వం తెచ్చిన నియంత్రిత సాగుతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఎంపీపీ పుట్టల సునీత అన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నియంత్రిత సాగు విధానంపై వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం, మొల్కపట్నం, తిమ్మారెడ్డిగూడెం గ్రామాల్లో రైతులకు శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో జడ్పీటీసీ ఇరుగు మంగమ్మతో కలిసి పాల్గొని మాట్లాడారు.


రైతులు వ్యవసాయ అధికారుల సూచనలకు అనుగుణంగా పంటలు సాగుచేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలన్నారు. అడవిదేవులపల్లి మండలంలోని ఉల్షాయిపాలెం, గోన్యాతండా, చాంప్లాతండా గ్రామపంచాయతీల్లో నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నియంత్రణ సాగులో అనుసరించాల్సిన విధానాలపై రైతులకు అవగాహన కల్గించారు. కార్యక్రమంలో ఎంపీపీ ధనావత్‌ బాలాజీనాయక్‌, ఏఈవోలు హిదాయతుల్లా, రావుల నరేష్‌, ఆయాగ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు. తిరుమలగిరి(సాగర్‌) మండ లంలో  రైతులు పండించాల్సిన పంటల గురించి ఏఈవో హేమలత తదితరులు పాల్గొని అవగాహన కల్పించారు.

Updated Date - 2020-06-06T09:52:57+05:30 IST