వ్యవసాయ అనుబంధ రంగాలతో అధిక లాభాలు

ABN , First Publish Date - 2020-02-20T10:28:27+05:30 IST

వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలలో రాణించడం ద్వారా అధికలాభాలను సాధించవచ్చని వ్యవసాయ కళాశాల

వ్యవసాయ అనుబంధ రంగాలతో అధిక లాభాలు

అశ్వారావుపేట, ఫిబ్రవరి 19: వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలలో రాణించడం ద్వారా అధికలాభాలను సాధించవచ్చని వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డా.నరేంద్రరెడ్డి అన్నారు. ఐసీఏఆర్‌ షెడ్యూల్డ్‌ కులాల ఉప ప్రణాళికలో భాగంగా సేద్యపు విభాగం ఆధ్వర్యంలో బుధవారం కళాశాలలో సమగ్ర వ్యవసాయ విధానాలు అనే శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిచారు.


ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిఽథిగా హాజరైన నరేంద్రరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం, వాటి అనుబంధ రంగాలైన పాడిపశువులు, కోళ్లు, గొర్రెలు, మేకలు, తేనెటీగలు, పట్టుపురుగులు, కుందేళ్ల పెంపకం వంటివాటిని చేపడితే అధికలాభాలు సాధించవచ్చనని వివరించారు. కార్యక్రమంలో డా.వి. వెంకన్న, డా.కేజీకే మూర్తి, డా.ఐవీఎ్‌సరెడ్డి, కె.నాగాంజలి, కాడసిద్దప్ప, స్వాతి, స్రవంతి పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-20T10:28:27+05:30 IST