Advertisement
Advertisement
Abn logo
Advertisement

పేకాట దందా కేసు : Hero Nagashourya తండ్రి అరెస్ట్‌.. జైలుకెళ్లకుండానే బయటికి ఎలా వచ్చారు..!?

హైదరాబాద్‌ సిటీ : నార్సింగ్‌ పేకాట దందా కేసులో సినీ నటుడు నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్‌ను నార్సింగ్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌ చేశారు. మంచిరేవులలో పేకాట శిబిరం నిర్వహించిన ఫామ్‌ హౌజ్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి గార్గ్‌దిగా పోలీసులు విచారణలో తేలింది. దాన్ని నటుడు నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్‌ 2 సంవత్సరాలు లీజుకు తీసుకున్నట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడు గుత్తా సుమన్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించిన క్రమంలో పేకాట దందా గురించి శివలింగ ప్రసాద్‌కు ముందే తెలుసని, ఒక్కరోజు అద్దెకు తీసుకొని దందా నిర్వహించానని సుమన్‌ వెల్లడించినట్లు తెలిసింది. దాంతో శివలింగప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌ చేశారు. అప్పటికే బెయిల్‌ ప్రయత్నాలు చేసుకోవడంతో ప్రసాద్‌కు వెంటనే న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. దాంతో ఆయన జైలుకు వెళ్లకుండానే బెయిల్‌పై బయటకు వచ్చారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement