వారసత్వ నగరంగా రాజమహేంద్రవరం

ABN , First Publish Date - 2020-10-25T07:14:29+05:30 IST

రాబోయే రోజుల్లో వారసత్వ నగరం(హెరిటేజ్‌ సిటీ)గా రాజమహేంద్రవరం నగరాన్ని కేంద్రం గుర్తించనుందని, దీనికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అన్నారు.

వారసత్వ నగరంగా రాజమహేంద్రవరం

  • సహస్ర జ్యోతిర్లింగార్చనలో ఎంపీ భరత్‌రామ్‌

గోదావరి సిటీ, అక్టోబరు 24: రాబోయే రోజుల్లో వారసత్వ నగరం(హెరిటేజ్‌ సిటీ)గా రాజమహేంద్రవరం నగరాన్ని కేంద్రం గుర్తించనుందని, దీనికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. పుష్కర్‌ఘాట్‌లో శనివారం రాత్రి జరిగిన సహస్ర జ్యోతిర్లింగార్చన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుతగా ఆయన గోదావరి నిత్యహారతిని దర్శించారు. ఈ సందర్భంగా భరత్‌రామ్‌ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్‌రెడ్డి విజయవాడ అమ్మవారిని దర్శించుకున్నారని, కరోనా విపత్తు నుంచి ప్రజలందరినీ రక్షించాలని పూజలు నిర్వహించారన్నారు. ఈ నగరానికి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తున్నామని, ఇక్కడ గోదావరి తీరాన జన్మించడం మనందరి అదృష్టమని అన్నారు. మహిళలంతా భక్తి, శ్రద్ధలతో దీపాలను వెలిగించారు.

Updated Date - 2020-10-25T07:14:29+05:30 IST