Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎన్-95 మాస్క్ చరిత్ర తెలుసా..? లేదంటే ఇది చదవండి

ఇంటర్నెట్ డెస్క్:  కరోనా సోకకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే మాస్క్ వాడాలి. అందులోనూ ఎన్-95 మాస్క్ వాడితే ముక్కు, నోటి నుంచి ఎటువంటి వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించవని శాస్త్రవేత్తలు చెబుతారు. ప్రస్తుతం ప్రపంచంలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో ఎన్-95 మాస్కులకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. అయితే ఈ ఎన్-95 మాస్కులు ఎవరు తయారు చేశారు..  మొదటగా ఏ దేశంలో ఉపయోగించారు.. అనే విషయాలు మీకు తెలుసా..? తెలియకపోతే ఇది కచ్చితంగా చదవండి. తొలిసారి మాస్కును వినియోగించింది చైనాలోనే.. 1910లో చైనాలో ప్రబలిన ప్లేగు వ్యాధి నుంచి రక్షణ పొందేందుకు అక్కడి కోర్టులో పనిచేసే ఓ ఉద్యోగి వస్త్రంతో మాస్కును తయారుచేసుకుని వినియోగించాడు. ఆ తరువాత 1918లో ఫ్లూ విజృంభించినపుడు కూడా ఈ మాస్కులనే ఎక్కువగా వినియోగించారు.


వాటి స్ఫూర్తితో మొదటి ప్రపంచ యుద్ధంలో గ్యాస్‌ మాస్క్‌లు తయారయ్యాయి. 1970లో అమెరికా గనుల శాఖ కార్మికుల కోసం సింగిల్‌ యూజ్‌ రెస్పిరేటర్స్‌ మాస్కులను రూపొందించారు. అయితే మొదటిసారిగా 1972లో 3ఎం అనే సంస్థ తొలిసారి ఎన్‌95 రిస్పిరేటర్స్‌ను రూపొందించింది. కానీ వాటిని కేవలం వస్త్ర పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు మాత్రమే వాడేవారు. ఈ నేపథ్యంలో సూక్ష్మక్రిములను అడ్డుకొనే తొలి ఎన్‌-95 మాస్క్‌ను 1992లో యూనివర్సిటీ ఆఫ్‌ టెన్నెస్సీ ఫ్రొఫెసర్‌ పీటర్‌ తై రూపొందించారు. ఈయన తైవాన్‌కు చెందిన మెటీరియల్ సైంటిస్ట్. అనేక సంవత్సరాలపాటు అమెరికాలో ఉద్యోగం చేసిన ఈయన ఈ మాస్కును కనిపెట్టడమే కాకుండా 1995లో దీనికి పేటెంట్‌ హక్కులు కూడా పొందారు. మొదట్లో దీనికి ట్యూబర్‌కులోసిస్‌ నుంచి రక్షణ పొందడానికి వినియోగించారు. ఆ తరువాత కూడా ఎన్నో వ్యాధులు సోకకుండా ఈ మాస్కులు లక్షలమందిని రక్షించాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో ఈ మాస్క్‌లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. చూశారా ఎన్-95 మాస్క్ వెనుక ఎంత చరిత్ర ఉందో. అప్పుడూ ఇప్పుడూ ఈ ఎన్-95 మాస్కులు ఎన్నో ప్రాణాలను కాపాడుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 


 ఇదిలా ఉంటే వైరస్‌ల బారినుంచి ప్రజలకు మరింత రక్షణ కల్పించే మాస్కులను రూపొందించేందుకు ఎన్-95 సృష్టికర్త తై మళ్లీ నడుం బిగించారు. ఎప్పుడో ఉద్యోగ విరమణ పొందినప్పటికీ మళ్లీ పని ప్రారంభించారు. మాస్క్‌లపై ప్రయోగాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచ శ్రేయస్సు కోసం ఇంతలా ఆలోచిస్తున్న పీటర్ తైని కచ్చితంగా మెచ్చుకోవల్సిందే. ఏమంటారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement