ఆ పండ్ల దుకాణం యజమానిపై కేసు.. మండిపడ్తున్న మాజీ సీఎం

ABN , First Publish Date - 2020-04-26T21:49:11+05:30 IST

జంషెడ్‌పూర్: జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ఓ పండ్ల దుకాణం యజమానిపై కేసు నమోదైంది. ఐపీసీ 107 సెక్షన్ కింద జంషెడ్‌పూర్‌ పోలీసులు...

ఆ పండ్ల దుకాణం యజమానిపై కేసు.. మండిపడ్తున్న మాజీ సీఎం

జంషెడ్‌పూర్: జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ఓ పండ్ల దుకాణం యజమానిపై కేసు నమోదైంది. ఐపీసీ 107 సెక్షన్ కింద జంషెడ్‌పూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దుకాణానికి రాముడు, శివుడు ఉన్న పోస్టర్లపై హిందూ ఫలాలు అని రాసి ఉంది. కాషాయం జెండాలు కూడా కట్టడంతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందంటూ ఈ కేసు పెట్టామని పోలీసులు చెబుతున్నారు. 


జాతీయ మీడియా ఛానెళ్లలో దీనిపై పెద్ద ఎత్తున చర్చలు చేపట్టడంతో రగడ మరింత ముదురుతోంది. 


యజమానిపై కేసు నమోదు కావడంపై బీజేపీ మండిపడింది. హేమంత్ సొరేన్ నేతృత్వంలోని ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని మాజీ సీఎం రఘుబర్ దాస్ ఆరోపించారు. హిందు అని రాయడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. హిందు అని రాయడాన్ని ఎప్పుడు నిషేధించారని ఆయన ప్రశ్నించారు. మిగతా మతాల వారు కూడా జెండాలు కడుతున్నారని, దుకాణాలకు పేర్లు పెట్టుకుంటున్నారని అంత మాత్రం చేత అందరిపైనా కేసులు పెట్టగలరా అని రఘుబర్‌దాస్ ట్విటర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. సొరేన్ ప్రభుత్వం ద్వంద్వ నీతి పాటిస్తోందని ఆయన ఆరోపించారు.



Updated Date - 2020-04-26T21:49:11+05:30 IST