దాతలు ఆదుకోవాలి

ABN , First Publish Date - 2021-06-21T06:05:43+05:30 IST

తల్లిదండ్రుల వృద్ధాప్యం.. 30ఏళ్లు నిండిన అక్కకకు పెళ్లి చేసేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడం.. పీజీ చదువుకున్నప్పటికి ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఓ దివ్యాంగుడు.

దాతలు ఆదుకోవాలి

కుటుంబ పోషణ కోసం దివ్యాంగుడి అభ్యర్థన
అంబాజీపేట, జూన్‌ 20: తల్లిదండ్రుల వృద్ధాప్యం.. 30ఏళ్లు  నిండిన అక్కకకు పెళ్లి చేసేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడం.. పీజీ చదువుకున్నప్పటికి ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఓ దివ్యాంగుడు. దాతల సాయం కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తుంది. అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు పరిధిలోని ఇందిరానగర్‌కు చెందిన బీర అంబేడ్కర్‌ పుట్టికతో దివ్యాంగుడు. హాస్టల్‌లో ఉంటూ ఎంఏ బీఈడీ వరకు చదువుకున్నాడు. ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగం చేసేందుకు దివ్యాంగత్వం అడ్డుగా మారింది. దీంతో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు బీర చంద్రరావు, లీలావతిలను పోషించడం కష్టంగా  మారింది. చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించే  తండ్రి చంద్రరావుకు గత ఏడాది జరిగిన ప్రమాదంలో కాలర్‌బోన్‌ విరిగిపోవడంతో ఆపరేషన్‌ చేయించలేని పరిస్థితి. ఈకుటుంబం  ఉండేందుకు సరైన ఇల్లు కూడా లేకపోడంతో వర్షాకాలం చాలా ఇబ్బందులు పడుతున్నామని అంబేడ్కర్‌ ఆవే దన వ్యక్తం చేశాడు. 30ఏళ్ల అక్కకు ఆర్థికస్థోమత లేక పెళ్లి చేయలేని పరిస్థితి.  దాతలు తమ కుటుంబాన్ని ఆదుకోవాలని అంబేడ్కర్‌ కోరుతున్నాడు.  దాతలు బీర చంద్రరావు, ఖాతా నెంబరు 34470546982, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌: ఎస్‌బీఐఎన్‌ 12693, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ముక్కామల బ్రాంచ్‌కు వేయాలని కోరుతున్నాడు.

Updated Date - 2021-06-21T06:05:43+05:30 IST