నిరుపేదలకు ఆపద్బంధు.. సీఎం సహాయనిధి

ABN , First Publish Date - 2022-07-07T04:54:32+05:30 IST

అత్యవసరమైతేనే ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాలని, సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అన్నిరకాల వైద్యులు, సేవలు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వివరించారు.

నిరుపేదలకు ఆపద్బంధు.. సీఎం సహాయనిధి
మహిళలకు కుట్టు మిషన్లను అందిస్తున్న మంత్రి హరీశ్‌రావు

రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు 

సిద్దిపేట టౌన్‌, జూలై 6: అత్యవసరమైతేనే  ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాలని, సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అన్నిరకాల వైద్యులు, సేవలు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వివరించారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 29 మంది లబ్ధిదారులకు రూ.10.80 లక్షలు మేర చెక్కులను అందజేసి మాట్లాడారు. ఆస్పత్రి వైద్యానికి వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టలేని నిరుపేద కుటుంబాలకు చేదోడు వాదోడుగా సీఎం సహాయనిధి సాయం అందిస్తున్నట్లు చెప్పారు. చెక్కులను తమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. 

పేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ

పేద మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వడం సంతోషకరమైన విషయమని, ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుని, స్వయం ఉపాధితో ఎదగాలని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. బుధవారం సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో టెక్‌ మహీంద్రా వారి సౌజన్యంతో సీఎ్‌సఆర్‌ ఫండ్‌ కింద మున్సిపల్‌ కౌన్సిలర్‌ మణిదీప్‌ సహకారంతో మహిళలకు మంత్రి హరీశ్‌రావు కుట్టు మిషన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో టెక్‌ మహీంద్రా ప్రతినిధులు, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరిక

సిద్దిపేట పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం వివిధ పార్టీలకు చెందిన పలువురు యువకులు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరారు. దీంతో వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పట్టణానికి చెందిన తాటికొండ సంతోష్‌ దేవుడు, ఆయన అనుచరులున్నారు.

అంతర్జాతీయ క్రీడాకారుడికి మంత్రి సన్మానం

15 నుంచి 24 వరకు బైరాన్‌లో జరిగే ఏషియన్‌ జూనియర్‌ హ్యాండ్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లికి చెందిన క్రీడాకారుడు సుభా్‌షచంద్ర ఎంపికయ్యాడు. దీంతో బుధవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో హరీశ్‌రావు సుభా్‌షచంద్రను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలు క్రీడా సంఘం నాయకులు రవీందర్‌రెడ్డి, వెంకటస్వామిగౌడ్‌, కనకయ్య పాల్గొన్నారు.  

Updated Date - 2022-07-07T04:54:32+05:30 IST